ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కొనిరెడ్డి
అమరావతి…
వైయస్సార్ కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మంగళవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతిలోని ఆయన కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కొనిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లా సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అనుడా (అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుండి తమ పంచాయతీకి రావలసిన రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు వెంటనే విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా గత ప్రభుత్వాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గడచిన 34 సంవత్సరాలుగా మైనర్ పంచాయతీలకు నూరు రూపాయలు అలాగే మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇస్తుండగా, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖామాత్యులు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏర్పడ్డ నూతన ప్రభుత్వంలో మైనర్ పంచాయతీలకు పది వేలు మేజర్ పంచాయతీలకు 25 వేల వరకు పెంచటం సంతోషించదగ్గ విషయమని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం జిల్లాలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చారు. కొనిరెడ్డి వెంట కొత్తపల్లి పంచాయతీ 13 వ వార్డు మెంబర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, యువ నాయకులు మూర్తి తదితరులు ఉన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68063