ఆంధ్రప్రదేశ్
ప్రియదర్శిని బాలవిహార్ లో దేశభక్తి వేడుకలు
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం

ప్రియదర్శినీ బాలవిహార్ లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. స్కూల్ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్రదేవ్ పతాకావిష్కరణ చేసారు. ఉపాధ్యాయినులు మూర్తి, ఇందు, రమ్య, సూర్యకుమారి భరతమాత చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి జ్యోతి ప్రజ్జ్వలన చేసారు.

8, 9, 10 తరగతుల బాలురు పలువురు స్వాతంత్య్రోద్యమ నాయకులను గుర్తుచేస్తూ ప్రసంగించిన తీరు ఎంతో బాగుంది. గోపాల కృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజి, మదన్ మోహన్ మాలవ్యా, బాల గంగాధర తిలక్, లాలా లజపతిరాయ్, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, సుభాష్ చంద్ర బోస్, రాణీ రుద్రమ దేవి, భగత్ సింగ్, మహాత్మాగాంధీ, రవీంద్ర నాథ్ ఠాగోర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, తదితరులను గురించి వీరు ఎంతో స్ఫూర్తిమంతంగా చెప్పడం ఎంతో బాగుంది.

10వతరగతి బాలికలు పాడిన “హైలెస్సా” జానపద గీతము, 9వ తరగతి బాలికలు పాడిన “వేదాలకు నిలయంగా ఈ ఆమని” దేశభక్తి గీతము, “తేరే మిట్టీ” గీతానికి చేసిన దేశభక్తి నృత్యము, ఎంతగానో అలరించాయి.

8వ తరగతి విద్యార్థులు ఏడుకొండలు చేసిన అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర, అభిర్వై చేసిన దేశభక్తి పూరిత ప్రసంగం ఆహూతులను ఉత్తేజితులను చేసాయి. బాలురు పాడిన “మన జాతీయ పతాకము గనరా” గీతము, బాలికలు పాడిన “నేను నాదేశం” గీతము పిల్లలలో ఎంతో దేశభక్తిని నింపాయి.
7వ తరగతి బాలబాలికలు పాడిన “జయము జయము భరతమాత” గీతము, కల్కి వేసిన అల్లూరి వేషము,6వ తరగతి బాలికలు చేసిన “వందేమాతరం” బృంద నృత్యము, “కొబ్బరాకు నీడలో గోదారి ఒడిలో” జానపద బృంద గీతము, అనురాగ్ పాడిన “తేరే మిట్టీ మే మిల్ జావాన్” హిందీ దేశభక్తి గీతము, నాగవైష్ణవి పాడిన “ఆవో బచ్చే తుమే దిఖాయే” హిందీ దేశభక్తి గీతము, 5వతరగతి బాలబాలికలు పాడిన “అంతా ఒకటే మనమంతా” దేశభక్తి గీతము, 3వ తరగతి బాలబాలికలు పాడిన “రివ్వు రివ్వు న సాగిపోవు రంగురంగుల జండా” గీతము అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

4వ తరగతి విద్యార్థిని వేసిన భరతమాత వేషము, 1వతరగతి విద్రార్థి వేసిన పోలీసు వేషము చూడ ముచ్చటగా ఉన్నాయి.
ఈ కార్యక్రమాలలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్ధినీ విద్యార్ధులు ఎంతో ఉత్సాహంగా దేశభక్తితో పాల్గొన్నారు. చిన్నారులకు స్వీట్స్ పంచడంతో కార్యక్రమాలు ముగిసాయి.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87460