ఆంధ్రప్రదేశ్
పొడగట్లపల్లి అన్నా క్షేత్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
రావులపాలెం మండలం
*అన్నా క్షేత్రలో ముడి సరుకులు ఆహారం నాణ్యత, వంట గదుల పరిశుభ్రత ను పరిశీలించిన కలెక్టర్*
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు పాఠశాలలకు నాణ్యమైన ఆహారాన్ని రావులపాలెం మండలం పొడగట్లపల్లి అన్నాక్షేత్రా నుంచి సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు.


శుక్రవారం రావులపాలెం మండలం పొడగట్లపల్లి లో హరే కృష్ణ ఉద్యమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్షేత్రాను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సందర్శించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 6 అన్న క్యాంటీన్లకు రావులపాలెం మండలం పొడగట్లపల్లి లోని హరే కృష్ణ ఉద్యమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్షేత్రా నుంచి ఆహారం సరఫరా చేస్తున్నారు.
ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్న ఆహారం, ముడి సరుకుల నాణ్యత ,వంట గదులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం మండపేట పట్టణాలలో పునః ప్రారంభమైన అన్నా క్యాంటీన్లకు పొడగట్లపల్లి అన్న క్షేత్రం నుంచే ఆహారం సరఫరా అవుతుందని.. ఆహారం ముడి సరుకుల నాణ్యత, వంట గదుల శుభ్రత తదితర అంశాలను పరిశీలించడం జరిగిందన్నారు.
ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ అన్న క్షేత్రా నుంచి ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆహారాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఈ అన్నాక్షేత్రా నుంచి ఒక రోజుకు ఎంతమందికి ఆహారం సరఫరా చేయవచ్చునో అని ఆ సంస్థ జనరల్ మేనేజర్ ను ఆరా తీయగా .. రోజుకు 30 వేల మందికి ఆహారం సరఫరా చేయగల సామర్థ్యం ఉన్న కిచెన్ అందుబాటులో ఉందని మేనేజర్ తెలిపారు.
త్వరలోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు పాఠశాలలకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని పొడగట్లపల్లి అన్నా క్షేత్రా నుంచి సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హరే కృష్ణ ఉద్యమం జోన్ వన్ జనరల్ మేనేజర్ శ్రీరామ్ ప్రసాద్, రావులపాలెం తాసిల్దార్ ముక్తేశ్వరరావు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87460