Connect with us

ఆంధ్రప్రదేశ్

అభివృద్ధిలో దూసుకుపోతాం కొత్తపేట ఎమ్మెల్యే బండారు ఎంపీ హరీష్

Published

on

రిపోర్టర్: జైదేవ్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

కొత్తపేట నియోజకవర్గం

రావులపాలెం మండలం

గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గంలో నిర్లక్ష్యానికి గురైన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు.

డా బి.ర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి అనంతరం అయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రూ. 30 లక్షల అంచనా విలువతో రావులపాలెం మండలం గోపాలపురం ఎస్సీ ఏరియాలో డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఏటిగట్టు వరకు, మాకా జాన్ ఇంటి నుంచి గొంతేలమ్మ గుడి వరకు నిర్మిస్తున్న సిసి రోడ్డు డ్రైన్ నిర్మాణానికి అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, శాసనసభ్యులు బండారు సత్యానందరావులు శుక్రవారం శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, మౌళిక సదుపాయాల కల్పన కోసం అందించే నిధులను సైతం సద్వినియోగం చేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అధ్వానంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల్లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు.

ఈ రూ.30 లక్షలు మాత్రమే కాదు మరో రూ.40 లక్షల వరకూ పెండింగ్ లో ఉన్నాయని, త్వరలోనే విడుదల అవుతాయని, మూడు నెలల్లోనే గోపాలపురం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు బీజం వేయడం జరిగిందన్నారు. గోపాలపురం గ్రామస్తులు గత ఎన్నికల్లో తనపై చూపించిన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మరిచిపోలేనన్నారు. గ్రామంలో గతంలో పీహెచ్సీ, ఎస్సీ,కాపు కమ్యూనిటీ భవనాలు, వాటర్ ట్యాంకు తదితర పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు.

ఎంపీ హరీష్ మాధుర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయంలో ఈ గ్రామంలో దళితులపై అక్రమ కేసులను బనాయించి ఎన్నో ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. గ్రామ అభివృద్ధితో పాటు అక్రమ కేసులను ఎత్తివేస్తామని ఇచ్చిన హామీ కి కట్టుబడి ఉన్నామని అన్నారు. గత ప్రభుత్వ పాలన ఎంత అధ్వానంగా జరిగింది అనేది అందరికీ తెలిసిందే అన్నారు.ఈ కార్యక్రమం లో ఆకుల రామకృష్ణ,కె వి సత్యనారాయణ రెడ్డి,గుత్తుల పట్టాభి,బండారు సంజీవ్,చిలువూరి సతీష్ రాజు, అధికార నాగేశ్వరరావు, మైగపుల గుర్రయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580187
Total Users : 47871