ఆంధ్రప్రదేశ్
పత్తికొండ నియోజకవర్గ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించండి – క్రాంతి నాయుడు పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి
కర్నూలు జిల్లా
పత్తికొండ
స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి క్రాంతి నాయుడు మాట్లాడుతూ 20 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పత్తికొండ నియోజకవర్గం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది అని ఈ ప్రాంత అభివృద్ధి మరియు సాధికారత కోసం ప్రభుత్వం వెంటనే పలు చర్యలు తీసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం పత్తికొండ డివిజన్, ప్రతి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని విస్మరిస్తుంది అని ఇక్కడ అభివృద్ధి అనేది లేకుండా పోయింది అని అన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేవు అని, డీఎస్సీ కోచింగ్ సదుపాయాలు లేవు, బాలికల వసతి గృహం లేదు, అన్న క్యాంటీన్ లేదు, త్రాగునీటి సమస్య, డాక్టర్ల కొరత లాంటి సమస్యలతో ఈ నియోజకవర్గం అల్లాడుతుంది అని అన్నారు. ఈ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా వలసల నివారణ కోసం ఎటువంటి చర్యలు లేవు అని, డ్రైనేజీ వ్యవస్థ లేదు, రోడ్ల విస్తీరణ లేదు మరియు నిర్మాణాలు లేవు, చెరువులు పిల్ల కాలువలు ద్వారా నింపుతాం అని పోయిన ప్రభుత్వంలో చెప్పి పైప్ లైన్లు వేసి అది కూడా పూర్తి చేయకుండా కరువు ఏర్పడింది అని అన్నారు, హంద్రీనీవా ద్వారా ఇతర జిల్లాలకు నీరు పోతుంది కానీ మాకు మాత్రం ఉపయోగం లేకుండా పోయింది అని వాపోయారు, డిజిటల్ లైబ్రరీ, కార్పస్ నిధులు, నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వృత్తి విద్యా కోర్సులు, మద్దతు ధర కోసం రియల్ టైమ్ మార్కెట్లు, టమోటా ప్రాసెసింగ్ యూనిట్, ఆటోమొబైల్ అసెంబ్లింగ్ యూనిట్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటి వాటి పైన ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అని కోరారు. ప్రాంత అభివృద్ది కోసం నియోజకవర్గ యువత తో పాటు కలిసి కృషి చేస్తాం అని తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు టౌన్ అధ్యక్షులు ప్రసాద్, మొహమ్మద్, రవి తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67849