ఆంధ్రప్రదేశ్
బాధ్యతా రహితంగా కాంట్రాక్టర్లు.వారి బిల్లులపై కళ్ళు మూసుకుని సంతకాలు పెడుతున్న నగరపాలక సమస్త ఇంజనీర్లు
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ
కాల్వల్లో,ఫుట్పాత్ పై టన్నుల కొద్దీ మట్టిని వదిలేసిన కాంట్రాక్టర్లు.రోడ్లపై నిలిచిన వర్షం నీరు.ఇబ్బంది పడుతున్న ప్రజలు

రోడ్లపై నీళ్లు నిలువకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఉన్నతాధికారుల సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాలిచ్చినా కర్నూలు నగరపాలక సంస్థ ఇంజనీర్లు స్పందించడం లేదని నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎం నాగరాజు, కే శ్రీనివాసులు, టీ పురుషోత్తం రెడ్డి, టి కృష్ణ విమర్శించారు. నిబంధనలు పాటించకుండా కోట్లాది రూపాయలతో చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడక పోగా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. సంఘం ప్రతినిధి బృందం ఈరోజు నగరంలో పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్ల రూపాయలు వెచ్చించి వేస్తున్న రోడ్లపై వర్షం నీరు ఎందుకు నిలుస్తుంది అని ప్రశ్నించారు. అశోక్ నగర్ పంప్ హౌస్ లో వ్యాపార సముదాయం (షాపింగ్ కాంప్లెక్స్ )నిర్మించిన కాంట్రాక్టర్ టన్నుల కొద్దీ మట్టిని మురికి కాలువలో,ఫుట్పాత్ పైన వదిలేసారని అన్నారు. దీనివల్ల మురికి నీటితో పాటు వర్షం నీరు రోడ్డు పై నిలచి వెంకటరమణ కాలనీ రోడ్డు పై వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇంత బాధ్యత రహితంగా వ్యవహరించే కాంట్రాక్టర్ల బిల్లులపై మున్సిపల్ ఇంజనీర్లు కళ్ళు మూసుకొని సంతకాలు పెడుతున్నారా? అని ప్రశ్నించారు. దీనికి తోడు వి ఆర్ కాలనీ ప్రధాన రోడ్డు మధ్యలో త్రాగునీటి పైపులైన్ల వాల్ ఫిట్స్ లీకై రోడ్డు పైకి రావడంతో పాటు త్రాగునీరు కలుషితమవుతున్నాయని గత మూడు నెలల నుండి మున్సిపల్ అధికారులకు అనేకసార్లు చెప్పినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ రవీంద్రబాబు జోక్యం చేసుకొని బాధ్యతారహితంగా వ్యవహరించే కాంట్రాక్టర్లు,ఇంజనీర్లపై విచారణ జరపడంతో పాటు రోడ్లపై నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పర్యటనలో ఎన్ మద్దిలేటి,బి రాజు,ఎ మధు, శ్రీనివాసరెడ్డి తదితరులుపాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 68130