ఆంధ్రప్రదేశ్
కానాల గ్రామానికి చెందిన లతా అనే మహిళలకు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న తాలూకా సిఐ అస్రార్ భాషా పై చర్యలు తీసుకోవాలి.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
అవినీతికి పాల్పడిన సీఐపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం.
ఏపీ మహిళా సమాఖ్య డిమాండ్.
నంద్యాల తాలూకా సిఐ అస్రార్ భాష కానాల గ్రామానికి చెందిన లతా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదును ఏమాత్రం లెక్కచేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ అవినీతికి పాల్పడి ఆమె అత్త భర్తలకే ప్రోత్సహిస్తూ కేసు నమోదు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న సిఐపై చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీదేవి, రజిత ,మహిళా నాయకురాళ్ళు ఎస్.మున్ని సుశీలమ్మ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మహిళ నాయకురాళ్లు మాట్లాడుతూ
నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన లత అనే మహిళ ఎనిమిది సంవత్సరాల క్రితం గోస్పాడు మండలం జిల్లెల గ్రామానికి చెందిన హరి రవీంద్రతో వివాహం జరిగిందని, ముగ్గురు పిల్లల సంతానం కలిగినట్లు తెలిపారు . ఆమెను అత్త మహాలక్ష్మి ,భర్త హరి రవీంద్ర, ఆడపడుచు శ్రీలక్ష్మి తో పాటు అత్త తమ్ముళ్లు బాల నరసింహులు, పెద్ద నరసింహులు ఐదు మంది నానా రకాలుగా వేధిస్తూ మానసికంగా శారీరకంగా ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారని, ఈ విషయంపై గోస్పాడు పోలీసుల వద్దకు వెళ్లిన న్యాయం జరగకపోవడంతో నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ లో గత 20 రోజుల నుండి తాలూకా సిఐ రోజు విచారణ పేరుతో పిలిపించి న్యాయం చేయకపోగా ఆమె భర్తతో సంసారం చేయడానికి సిద్ధపడిన, అత్త వేధింపులు వేధిస్తున్న భర్త ఒక్కడే ఉండడం వల్ల అత్త భర్త పేరు మీద ఆస్తిని ఆడపడుచుకు రిజిస్టర్ చేపించారని, ఈ విషయాన్ని అంతా తాలూకా సిఐ కి వివరించిన ఒక లాయర్ ద్వారా సిఐ కి పెద్ద మొత్తం డబ్బులు ముట్టడంతో లతా ఇచ్చిన ఫిర్యాదును నిర్లక్ష్యం చేస్తూ కేసు నమోదు చేయకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు.
జిల్లాలో రోజు రోజుకు మహిళలకు రక్షణ లేకుండా అనేక అక్రమాలు అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసు అధికారులు ఉండడంతో మహిళలకు రక్షణ కరువైందని, జిల్లా ఎస్పీ కానాలకు చెందిన లతకు న్యాయం జరిగేలా చూడాలని, లతకు న్యాయం జరిగేంత వరకు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నామని మహిళ నాయకురాలు తెలిపారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68140