ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఆన్లైన్ వన్ బి అడంగల్ సమస్యను పరిష్కరించండి. కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు
కడప జిల్లా :
కడప జిల్లాలో భూ సురక్ష,రీ సర్వే పేరుతో వన్ బి అడంగల్ ఆన్లైన్ లో రాకపోవడంతో రైతుల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని సోమవారం కడప ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో భూ సురక్ష రీ సర్వే పేరుతో సర్వే చేస్తున్నారని భూములు ఆన్లైన్లో వన్ బి అడంగల్ రాకుండా మండల తహసిల్దార్ లు నిలిపివేశారని తద్వారా బ్యాంకులో రైతులు రుణాలు రెన్యువల్ చేసుకోవాలంటే ఆన్లైన్ వన్ బి అడంగల్ అడుగుతున్నారని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఎర్రగుంట్ల మండలం చిలంకూరు రెవెన్యూ పరిధిలో ఉన్న చీర్రాజు పల్లె గ్రామంలో ఆన్లైన్ వన్ బి అడంగల్ రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు . పిల్లల చదువుల కోసం ,పెళ్లిళ్ల కోసం భూముల అమ్మాలన్న కొనాలన్నా రిజిస్టర్లు చేసుకోవాలన్న ఆన్లైన్ వన్ బి అడంగల్ రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని బ్యాంకులలో వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆయన తెలిపారు. జిల్లాలో చాలామంది రైతులు సబ్ డివిజన్ కాలేదని భూములను ఆన్లైన్ లో వన్ బి అడంగల్ రాకుండా నిలిపివేయడం తగదని ఆయన తెలిపారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆయన జిల్లా కలెక్టర్ ను కోరారు. *కలెక్టర్ వివరణ ఈ సమస్యను సీసీఎల్ఏ విజయవాడ వారి దృష్టికి తీసుకొని పోయి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.* ఈ కార్యక్రమంలో బాధిత రైతులు శివారెడ్డి ప్రతాపరెడ్డి రమణ ఖలీల్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136907