ఆంధ్రప్రదేశ్
శ్రీశైల మహా క్షేత్రంలో ప్రైవేటు సత్రాలు ఇష్టా రాజ్యం గా వ్యవరిస్తున్నారు. వసతి గదుల ఒకరోజు అద్దె రూ.3వేలు తీసుకుంటున్నారు. పర్యవేక్షణ చేపట్టాల్సిన దేవస్థాన అధికారులు చోద్యం చూస్తున్నారు.
ఏపీ టుడే న్యూస్, శ్రీశైలం

శ్రీశైలంలో సత్రాల ఇష్టా రాజ్యం
– వసతి గదుల ఒకరోజు అద్దె రూ. 3వేలు
– చోద్యం చూస్తున్న దేవస్ధానం అధికారులు
– శ్రీశైలంలో సుమారు 50 సత్రాలు పైగా ఉంటాయి ఆయా
సత్రాలు కూడా రద్దీ సమయంలో అధికంగా వసూలు
చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
శ్రీశైల మహా క్షేత్రంలో వెలసిన శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనార్థం ప్రతి రోజు వేలాది మంది భక్తులు శ్రీశైలం తరలి వస్తారు. శ్రీశైలం వచ్చిన భక్తులు వసతి గది తీసుకుంటారు. భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకొని క్షేత్రం లో ప్రైవేటు సత్రాలు తమ ఇష్టా రాజ్యం గా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం లోని మెదర సత్రం భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. భక్తులు అధికంగా ఉండే శని, ఆది, సోమవారం లలో ఒక అద్దె, మంగళవారము నుంచి శుక్రవారం వరకు ఒక అద్దె వసూలు చేస్తున్నారు. శని నుంచి సోమవారం వరకు ఒకరోజు ఏసీ రూమ్ అద్దె రూ. 3వెలు వసూలు చేస్తున్నారు. నాన్ ఏసీ రూమ్ రూ.2,500 వసూలు చేస్తున్నారు. దేవస్థానం, సత్రం నిభందనలకు విరుద్ధంగా భక్తుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. సత్రాలలో అద్దె వసూలును పర్యవేక్షణ చేపట్టాల్సిన దేవస్థాన అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో సత్రాలు ఇష్టా ను సారంగా వ్యవహరిస్తూ భక్తులను నిలువు దోపిడి చేస్త్తున్నారు. ఇప్పటికైనా దేవస్థాన అధికారులు స్పందించి భక్తుల నుంచి అధిక డబ్బులు వసూలు చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87514