ఆంధ్రప్రదేశ్
విజయవాడ వరద బాధితుల సహాయార్థం కిట్లను పంపిన ఎమ్మెల్యే సత్యానందరావు
రిపోర్టర్: జైదేవ్
కొత్తపేట నియోజకవర్గం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
రావులపాలెం మండలం
విజయవాడ వరద బాధితుల సహాయం కోసం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కిట్లను పంపించడం జరిగింది.
రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద లోడ్ లారీను సత్యానందరావు జెండా ఊపి సాగనంపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వర్షాలతో వల్ల వరదతో విజయవాడ,గుంటూరు నగరాలు ముంపు బారినపడటం బాధాకరం అని అన్నారు.వారిని ఆదుకోవడం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బాధితులకు అండగా ఉంటూ వారి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.
అన్ని సహాయక చర్యలు చేపడుతున్న కూటమి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండటానికి తమ వంతు సాయంగా కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 75 వేల టూత్ బ్రష్ లను,13 వేల హ్యాండ్ వాష్ ల లోడ్ ను లారీలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి పంపడం జరిగిందని సత్యానందరావు తెలిపారు.
ఇదే విధంగా తమ వంతు సాయంగా అందరూ విజయవాడ వరద బాధితులకు సహాయం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ,చిలువూరి సతీష్ రాజు,గుత్తుల పట్టాభిరామ్,కంఠంశెట్టి శ్రీనివాస్,జక్కంపూడి వెంకటస్వామి,చీకురమిల్లి లవరాజు,కాసా సాగర్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87505