ఆంధ్రప్రదేశ్
నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మాణాలు చేస్తున్నా స్పందించని నగరపాలక సమస్త ఇంజనీర్లు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఇంట్లో నుండి బయట అడుగు పెట్టే అవకాశం లేకుండా రోడ్లను బురుదమయం చేసిన కాంట్రాక్టర్

వర్షాకాలం కొత్త రోడ్ల నిర్మాణం ఏ కాంట్రాక్టరూ ప్రారంభించరు.రోడ్డు నిర్మాణం ప్రారంభించడం తప్పని పరిస్థితి అయితే స్థానిక ప్రజలు తమ ఇండ్లకు చేరేందుకు రోడ్డుకు ఒకవైపు నడిచేందుకు ఏర్పాటు చేస్తారు. కానీ నగరపాలక సమస్త కాంట్రాక్టరు ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించకుండా వర్షాకాలం రాఘవేంద్ర నగర్ లో పనులు ప్రారంభించి పిల్లలు వృద్దులు రోడ్డుపై అడుగుపెట్టే పరిస్థితి లేకుండా రోడ్డును బురద మయం చేశారని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి,సివి వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం సంఘం ప్రతినిధి బృందం రాఘవేంద్ర నగర్ లో పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణాలు ప్రారంభించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటే నగర పాలక సంస్థ ఇంజనీర్లకు పట్టదా? అని ప్రశ్నించారు. రోడ్డు పనులు ప్రారంభించే ముందు పాత మట్టిని తొలగించి..రోలర్ తిప్పుతూ..ఎర్ర మట్టి వేస్తూ…మళ్లీ రోలర్ తిప్పితే వాహనాలు దిగబడవు. రోడ్డు బుడదమయ్యే పరిస్థితి ఉండేది కాదన్నారు. రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం, ఉన్న ఇంజనీర్లు స్పందించకపోవడం వల్లే ప్రజలకు ఈ కష్టాలు దాపరిచారని విమర్శించారు. వారం రోజులుగా ఇంట్లో నుండి బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని…వార్డు సచివాలయ సిబ్బంది గానీ,ఏ అధికారులు గానీ పట్టించుకోవడం లేదని స్థానిక మహిళలు రమాదేవి , స్వర్ణలత తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల జోక్యం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు లేని పద్ధతిలో నిర్మాణాలు చేపట్టాలని కోరారు.
ఇరిగినేని పుల్లారెడ్డి
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87482