ఆంధ్రప్రదేశ్
రుద్రవరంలో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు.
సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఏపీ టుడే న్యూస్
నంద్యాల జిల్లా బ్యూరో.
భగవన్మయమైన భాగవతం విన్నా, చదివినా భగవత్తత్వం తెలుస్తుందని, ఇందులో సృష్టి రహస్యాలు, ఖగోళ విశేషాలతో పాటు సమస్తమైన జ్ఞాన సంపద ఇందులో ఉన్నదని, ఇది భారతీయుల అపురూప సంపద అని, ఈ తరానికి ఇటువంటి సాహిత్యాన్ని అందించడంవల్ల మాత్రమే భారతీయత నిలుస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా, మండల కేంద్రమైన రుద్రవరం నందు వెలిసిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం నందు గత ఐదు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా జరిగిన ధార్మిక సభా కార్యక్రమంలో వారు ప్రవచించారు. నాలుగు రోజుల పాటు భాగవతంలోని దశమ స్కంధం శ్రీకృష్ణ లీలలపై శ్రీనివాస రామానుజ దాసు చేసిన ధార్మిక ప్రవచనాలు, ఇస్కాన్ ధర్మ ప్రచారకులు నిత్యతృప్తదాస్ ఆధ్వర్యంలో జరిగిన భజన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ధార్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లం కృష్ణమూర్తి, టి.వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెరుమాళ్ళ నరసింహయ్య, నల్లగట్ల వెంకటేశ్వర్లు, ప్రవీణ్ కుమార్, బింగుమళ్ళ సురేశ్, సుబ్బలక్ష్మి , లక్ష్మీదేవి, శ్రీనివాసులు, శివారెడ్డి, ఆంజనేయులు, సుబ్బమ్మతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465