ఆంధ్రప్రదేశ్
గౌతమ్ చేసిన ఫోన్‌కాల్‌కు అధికారులు వేగంగా స్పందించారు (వీడియో)
ఆంధ్రప్రదేశ్
విజయవాడ రూరల్ మండలం నున్నకు చెందిన కైలే గౌతమ్ శుక్రవారం తల్లి రమా కుమారితో కలిసి గూగుల్ మ్యాప్ సాయంతో నున్న నుంచి విజయవాడకు బయలుదేరారు. ఆ గూగుల్ మ్యాప్ సావరగూడెం- కేసరపల్లి మీదుగా చూపడంతో ఆ మార్గంలో వరద వస్తుందన్న విషయం తెలియని గౌతమ్ తన కారుతో 150 మీటర్ల దూరం ముందుకొచ్చారు. వరద ఎక్కువగా ఉండటంతో కారు సడన్‌గా ఆగిపోవడంతో తలుపులు తీసేందుకు యత్నించారు. ఎంతసేపటికి కారు అద్దాలు తెరుచుకోకపోవడంతో వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్, పలువురు నాయకులకు ఫోన్ చేసి విషయం తెలిపాడు. కొట్టుకుపోతున్నామని తమ ప్రాణాలు కాపాడాలంటూ గౌతమ్ చేసిన ఫోన్‌కాల్‌కు అధికారులు వేగంగా స్పందించారు. వెంటనే గ్రామ రెవెన్యూ అధికారికి, పంచాయతీ సిబ్బందికి పై అధికారులు తెలియజేశారు. వెంటనే క్షేత్రస్థాయి అధికార సిబ్బంది స్థానికులను అప్రమత్తం చేశారు. పంచాయతీలో పని చేసే మత్స్యకారుడైన లంకే నాగేశ్వరరావు, నూతక్కి హరికుమార్ తో పాటు కొంతమంది గ్రామస్థులు కారు అద్దాలు పగలకొట్టి గౌతమ్, అతని తల్లిని రక్షించి ఒడ్డుకు చేర్చారు.వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడిన ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466