ఆంధ్రప్రదేశ్
వరద బాధితుల సహాయార్ధం కోటి రూపాయలతో 10 వేల కిట్లు సిద్ధం.. మంత్రి టి.జి భరత్, టిడిపి జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్
కర్నూలు బ్యూరో
విజయవాడ వరద బాధితులకు అందించేందుకు 10 వేల నిత్యావసర సరుకుల కిట్లు సిద్ధం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్, తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. మౌర్య ఇన్‌లోని కార్యాలయంలో వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు, నాయకుల సహకారంతో పది వేల కిట్లు తయారుచేసినట్లు చెప్పారు. ఒక్కో కిట్‌లో 5 కేజీల బియ్యం, 1 కేజి కందిపప్పు, 1 కేజీ చక్కెర, ఉప్మారవ్వ, కారంపొడి తదితర నిత్యావసర వస్తువులు ప్యాక్ చేసి పెట్టామన్నారు. ఒక కోటి రూపాయలు ఖర్చు చేసి పది వేల కిట్లను సిద్ధం చేశామని చెప్పారు. మంగళవారం విజయవాడలో వీటిని పది వేల కుటుంబాలకు అందజేయనున్నట్లు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చి సహకారం అందించిన పార్టీ కార్యకర్తలు, దాతలకు వీరు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67966