ఆంధ్రప్రదేశ్
గణనాథుడి ఆశీస్సులు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి

గణనాథుడి ఆశీస్సులు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి
ఏపీ టుడే న్యూస్, మంత్రాలయం రిపోర్టర్
పెళ్లిరోజును పురస్కరించుకొని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి నీ దర్శించుకోవడానికి సతి సమేతంగా వచ్చిన మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ రాఘవేందర్ రెడ్డి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని అనంతరం శ్రీ రాయల మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం వినాయక చవితిని పురస్కరించుకొని మంత్రాలయంలో పలు కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయకులను దర్శించుకుని మీడియాతో మాట్లాడడం జరిగింది….ముందుగా మంత్రాలయం నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.నవరాత్రుల్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే అటువంటి పవిత్ర దినాలను నియోజకవర్గ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ధూప దీప నైవేద్యాలతో కోలవడం ఆనవాయితిగా వస్తుంది.ఈసారి రాష్ట్రంలో అధిక వర్షాల కారణంగా కొంత అలజడి ఏర్పడినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చోరవతో, ఆ వినాయకుడి చల్లని ఆశీస్సులతో వరద బాధితులను సమర్థవంతంగా ఆదుకోవడం జరిగింది.తుంగభద్రా నది కూడా ఉదృతంగా ప్రవహిస్తున్నందున,నియోజకవర్గ ప్రజలు కూడా అది గమనించి వినాయకుని నిమజ్జనం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వినాయక నిమజ్జనం సమయంలో పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించాము, ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అని తెలియజేస్తున్నామన్నారు.ప్రజలు కూడా వరద ఉధృతిని గ్రహించి వినాయక నిమజ్జనం ప్రశాంతంగా, సామరస్యంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము.అలాగే మంత్రాలయ నియోజకవర్గ ప్రజల మీద ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటన్నానన్నారు.చంద్రబాబు నాయుడు చొరవతో, ఆ గణనాథుడి ఆశీస్సులతో నియోజకవర్గము అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిసస్తున్నానన్నారు. మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక