ఆంధ్రప్రదేశ్
పాత కక్షలతోనే మహిళ దారుణ హత్య.

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
తండ్రిని చంపిందనే కోపంతోనే హత్య .
శాలుబి హత్య కేసులో నిందితులకు అరెస్ట్ రిమాండ్ .
ఆత్మకూరు డిఎస్పి రామాంజజీ నాయక్ .
కేసు ఛేదించిన సీఐ, ఎస్ఐలను అభినందించిన డిఎస్పీ
నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ లో న శాలుబి (45) అనే మహిళను గత గురువారం రాత్రి హత్య చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ కేసులో ఆదివారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు ఆత్మకూరు డిఎస్పీ రామాంజీ నాయక్ తెలిపారు.ఆదివారం నందికొట్కూరు సర్కిల్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ హత్య వివరాలు తెలియజేసారు. హత్యకు గురైన శాలుబి గతంలో 2015లో శాలుబి, ఆమె స్నేహితురాలు రేష్మ కలిసి వడ్డే లక్ష్మీనరసింహను హత్య చేశారన్నారు. నేడు లక్ష్మినరసింహా కుమారుడు తన తండ్రిని హత్య చేసిన శాలుబీని ఎలాగైనా హతమరచాలని అందుకు ప్రతీకారముగా వడ్డే చందు అతని మిత్రులు ఎస్ వెంకటరమణ. మనోజ్ కుమార్. పి స్వాములు ఏ వెంకటేశ్వర్లు సీసీఎల్ బాల నేరస్తుడు శాలిబిని చంపారన్నారు. డి.ఎస్.పి తెలిపారు. గురువారం అర్ధరాత్రి వేళ శాలుబి ఇంటికి వెళ్లిన నిందితులు గొడ్డలితో గేటును చెక్క తలుపులను పగలగొట్టి ఇంట్లోకి మారునాయుధాలతో అక్రమంగా వెళ్ళి శాలుబి కొడుకుని మౌలాలి ని భయపెట్టి హతురాలు పింజరు శాలబీని అతి కిరాతకముగా గొడ్డలి నాటు తుపాకులతో దాడి చేసి హత్య చేశారని తెలిపారు. ఈ హత్యలో బీహార్ కు చెందిన మనోజ్ కుమార్, మరొక బాల నేరస్తుడు తప్పించుకోవడంతో అతని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిందితులను ఆదివారం పట్టణం శివార్లలో ఉన్నారని తెలుసుకొని రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో అరెస్ట్ చేశారన్నారు. నిందితుల వద్ద ఉన్న రెండు నాటు తుపాకులు ఒక గొడ్డలిని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపించమన్నారు. కేసును చేదించిన సీఐ సుబ్రహ్మణ్యంను, ఎస్ ఐ లు లక్ష్మినారాయణ, తిరుపాలు, ఓబులేష్, శరత్ కుమార్ రెడ్డి లను నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా అభినందించారని తెలిపారు. కానిస్టేబుల్ చెన్నయ్య, హోంగార్డు గోపాల్, లను డిఎస్పీ రివార్డు అందించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక