ఆంధ్రప్రదేశ్
ఒక్క రూపాయి జీతం లేదు… కానీ మురికి కాలువలు శుభ్రం చేస్తాడు…
అన్నమయ్య జిల్లా,
రాయచోటి
ఎందరో ప్రభుత్వ ఉద్యోగులు వున్నారు. వేలకు వేలు జీతాలు పోందుతున్నారు. వారి విధులు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారో తేలియదు కానీ. ఉత్తమ పురస్కారాలు పోందుతున్నారు. కానీ ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి జీతం తీసుకోకపోయిన ఉత్తమ అవార్డుకు అసలు సీసలు అర్హత కలిగిన వ్యక్తి అని ఆ పట్టణ ప్రజలు కోనియాడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇంతకు ఏవరు అతను. లేట్స్ వాచ్ ద స్టోరీ.

అన్నమయ్య జిల్లా కేంద్రం, రాయచోటి పట్టణం ఇది. ఇక్కడ మ్యాన్ హోల్ తేరిచి మురికి కాలువను శుభ్రం చేస్తున్న వ్యక్తి మునిసిపల్ సిబ్బంది అనుకోనేరు. కాలువల్లో చెత్త చెదారం వుంటే మాత్రం వాటిని తీసేంత వరకు నిద్రరాదు. రూపాయి ఆశించిన వ్యక్తి కాదు. అతనికి మురికి కాలువలు అస్తవ్యస్తంగా వుంటే అతనికి నిద్ర పట్టదు. నాజ్ థియేటర్ నుంచి అలీమబాద్, ఠాణా, గాంధీ బజార్, నాదన్న వీధి ప్రాంతాల్లో మురికి కాలువల్లో చేత్త ఈరుక్కుంటే చాలు తక్షణమే వాటిని క్లీన్ చేసేంత వరకు కదలడు. అతను ఏమైనా మునిసిపల్ కార్మికుడా అంటే అది కూడ కాదు. ఎవరి నుంచైనా రుపాయి ఆశించి చేస్తాడా అంటే అది లేదు. పారిశుధ్యం పట్ల అతని శ్రమ కు మాత్రం ఏనాడు ఏవ్వరు ఒక్క అవార్డు, రివార్జు ఇచ్చింది లేదు. అతడి పేరు ఇంతియాజ్ అలీయాస్ ఛా. ఇతను చేసే పని ఉదయమో, సాయంత్రమొ టీహోటల్స్ కు వెళ్లి రెండు బిందేలు నీరు తేచ్చి టీ పాత్రలు కడిగివేళ్ళిపోవడమె. ఇతనికి వారు ఇచ్చే వాటితో కుష్కా, చపాతీ వంటివి తీనేసి బ్రతికేస్తుంటాడు. మిగిలిన రోజంతా చేసే పని మాత్రం కాలువలు శుబ్రపరచడం. కాలువలు శుబ్రపరచమని ఏవ్వరు ఇతనికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. తనే స్వయంగా కాలువలు నాజ్ థియేటర్ నుండి రోషన్ మసీద్ వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల కాలువలు పరిశీలిస్తాడు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మురికినీరు స్ట్రక్ అయిందని గుర్తిస్తే చాలు రంగంలో దిగిపోతాడు. చుట్టు ఎన్ని వాహనాలు వచ్చినా, ఎంత శబ్దం చేసిన అతని పని అతనిదే. మరి ఇదంతా అతను ఏదైనా ఆశించి చేస్తున్నాడా? ఎవరికైనా సమస్య వుంటే చెప్పి చేయించుకుంటున్నారా? అది లేదు. దాదాపు ఇతను ఇరవై ఏళ్లుగా కాలువలు శుబ్రపరుస్తున్నాడు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87482