ఆంధ్రప్రదేశ్
హెచ్ఎం సునీత దేవిని సస్పెండ్ చేయాలి -ఆర్ యూ ఎస్ ఆఫ్, ఆర్పీ ఎస్ ఆఫ్ : సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందచేత

ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం (ఉరుకుంద) రిపోర్టర్:
విద్యార్థులతో పనిచేయిస్తున్నటువంటి హెచ్ఎం సునీత దేవి ని సస్పెండ్ చేయాలని ఆర్ యు ఎస్ ఎఫ్ రఘునాథ్, ఆర్ పి ఎస్ ఎఫ్ ఆఫ్రిది ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ భరద్వాజ్ మౌర్యకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. గత వారం రోజుల క్రితం కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం అయినటువంటి సునీత దేవి విద్యార్థులతో పెద్ద పెద్ద బండరాళ్లను మొయించడం సిగ్గుచేటు అని,కలం పట్టాల్సినటువంటి చిన్ని చేతులతో పెద్ద పెద్ద బండ రాళ్లు మోయించడం అంటే బాధాకరమైనటువంటి విషయమని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోసం విద్యార్థుల అభివృద్ధి కోసం కష్టపడుతూ ఉంటే ఇలాంటి వారు మాత్రం విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించడం అంటే విద్యా వ్యవస్థకే సిగ్గుచేటు అని అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు మేము పనిచేసే విధంగా మా పిల్లలు పనిచేయకూడదని పాఠశాలకు పంపిస్తూ ఉంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్థులచే పనిచేయించడం అంటే చాలా సిగ్గుచేటు అని తమ సొంత పిల్లలను అయితే ఈ విధంగా పనిచేయిస్తుందా అని వారు ప్రశ్నించారు. అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి బండరాయలు మోసి విద్యార్థులు చేతులు గాయాలు కావడం జరిగిందని ఇలా పనిచేస్తున్నందుకు కొంతమంది విద్యార్థులు అయితే బడికి రావడం మానేసారని వారు అన్నారు. దీనిపై ప్రధానోపాధ్యాయురాలు సునీత దేవిని వివరణ అడగడానికి ప్రయత్నించగా సమాధానం చెప్పడానికి నిరాకరించారని అన్నారు. ఇకనైనా విద్యాశాఖ అధికారులు దీని పైన దృష్టి సారించి ఆమెపై విచారణ జరిపి ఆమెను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఉద్యమాలు మరింత ఉద్రిక్తం చేస్తామని వారు హెచ్చరించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక