ఆంధ్రప్రదేశ్
జీవో 85 కి వ్యతిరేకంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వైద్యులు దశల వారీ ఆందోళన.
నంద్యాల జిల్లా
రుద్రవరం :ఏపీ టుడే న్యూస్:-

ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (ఏపీపీ హెచ్ సి డి ఎ) వైద్యులు జీవో 85కి వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్స్ అందరూ నల్ల బ్యాడ్జిలు ధరించి విధులు నిర్వహించారు. మంగళవారం ఆలమూరు ఆరోగ్య కేంద్రం డాక్టర్ అమర్నాథ్ రెడ్డి, డాక్టర్ గాయత్రి, రుద్రవరం ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రావణి, నరసాపురం డాక్టర్ బాబు, డాక్టర్ శివ మోహన్ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జీవో 85 ద్వారా తమ మూడేళ్ల సర్వీసు అర్ధం లేకుండా పోయింది. ఇలా అకస్మాత్తుగా జీవోను మార్చడం అన్యాయం అని, తమ వృత్తి ప్రగతికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు. గత రెండు నెలలుగా జీవో 85 రద్దు చేయమని అన్ని అధికారులకు, శాసనసభ్యులకు అర్జీలు సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి సమాధానం రాలేదని వైద్యులు నిరాశ వ్యక్తం చేశారు. కోవిడ్ 19
సమయంలో మా జీవితాలను ప్రమాదంలో పెట్టి సేవలు అందించినప్పటికీ, ఇప్పుడు జీవో 85 ద్వారా పీజీ అవకాశాలు తగ్గించడం అన్యాయమని, ఇది ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలను ప్రభావితం చేస్తుందని అన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466