ఆంధ్రప్రదేశ్
జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు .
సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.


ఈ నెల 1వ తేది కురిసిన భారీ వర్షానికి విజయవాడ నగర ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు నంద్యాల జిల్లా ప్రజలు, సిపిఐ పార్టి ఆద్వర్యంలో నిత్యావసర వస్తువుల సేకరణకు సహకరించారు. దాదాపు 100 ప్యాకేట్ల బియ్యం, కందిపప్పు, బట్టలు, చింతపండు, వంట నూనెలతో అనేక రకాల సరుకులు సేకరించి విద్యార్ధి, యువజన, రైతు, ప్రజా నాట్యమండలి కళాకారులు నడుం బిగించి విజయవాడ వరద బాధితులకు తరలించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. బాబాఫకృద్దీన్ జిల్లా అంతా సమన్వయం చేశారు. నంద్యాలలో కే.ప్రసాద్, నాగరాముడు, సోమన్న, శ్రీనివాసులు,ధనుంజయ, 5 ప్యాకేట్స్ బియ్యం, 45 Kg వంటనూనె, 30 టి షర్ట్స్, ప్రజా నాట్యమండలి జిల్లా సమితి ఆద్వర్యంలో జిల్లా కార్యదర్శి శివయ్య, గోకారి, రమేష్ 60 ప్యాకేట్స్ బియ్యం, బట్టలు, బెడ్ షీట్స్, డోన్ లో పి. సుంకయ్య, రాధాకృష్ణ, నారయణ, షమీమ్ బేగం, లక్ష్మీదేవి, 6 ప్యాకేట్స్ బియ్యం, రూ.8,500/-లు నగదు, ఆత్మకూరులో ప్రతాప్, వెంకటశివుడు, చాంద్ బాష, స్వాతి, ముర్తుజాబి 10 ప్యాకేట్స్ బియ్యం, బెడ్ షీట్స్, రుద్రవరంలో కే.భాస్కర్, బాల నరసింహుడు, వెంకటేశ్వర్లు, రామచంద్రుడు, 15 ప్యాకేట్స్ బియ్యం, మహానందిలో సామేల్, తుపాకుల వెంకటేశ్వర్లు, నరసింహా 2 ప్యాకేట్స్ బియ్యం, రూ.1,300/- లు, గోస్పాడులో హరినాథ్, జిలానీ బాష, లక్ష్మీదేవి 2 ప్యాకేట్స్ బియ్యం, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, జిల్లా నాయకత్వం; సూర్య ప్రతాప్, చిన్న విజయ్, రంగస్వామి, దివాకర్, శశి, మనోజ్ ల నాయకత్వం 600 వాటర్ బాటిల్స్, ఆంద్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకత్వం; పి.వెంకటేష్ నాయకత్వంలో రూ.8,000/లు నిధుల సేకరణ, నందికొట్కూర్ వి.రఘరాం మూర్తి, రతిత నాయకత్వంలో రూ.4,000/లు నిధుల సేకరణ చేశారు. సేకరించిన వస్తువులన్నిటిని విజయవాడ వరద బాధితులకు వాహనంలో జెండా ఊపి తరలించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463