ఆంధ్రప్రదేశ్
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ-మెయిల్ పంపిన ముస్లింలకు ధన్యవాదాలు తెలిపిన జేఏసీ.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడానికి ఆఖరి రోజు కావడంతో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని సాధిక్ నగర్ మసీదు నందు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ-మెయిల్స్ పంపించే కార్యక్రమం చేపట్టడం జరిగిందని జేఏసీ కన్వీనర్ గన్ని అబ్దుల్ కరీం కో కన్వీనర్ మహబూబ్ బాషా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గన్ని అబ్దుల్ కరీం మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు సవరణ జరిగితే రాజ్యాంగం మైనార్టీలకు కల్పించిన హక్కులను కాలరాయడమేనని ఈ.బిల్లు అమలు జరిగితే ముస్లిమేతరులు వక్ఫ్ ఆస్తులపై పెత్తనం చలాయిస్తారని వక్ఫ్ బోర్డుకున్న అధికారాలను ప్రభుత్వం లాక్కుంటుందని అన్నారు. మసీదులు,మదర్సాలు ఖబరస్తాన్లు పీర్లచావిడీలు, దర్గాలు ఆస్థానాలు ఇతర వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు ఉన్న వక్ఫ్ ట్రిబ్యునల్ తన అస్తిత్వాన్ని కోల్పోనుందని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ-మెయిల్ పంపిన ముస్లిం సోదర సోదరిమణులందరికి జేఏసీ తరపున ధన్యవాదాలు తెలిపారు .
జేఏసీ కార్యవర్గ సభ్యులు సుహైల్ రానా రెహేమాన్ మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డులో రాజకీయ జోక్యం తగదని అసలు వక్ఫ్ ఆస్తులతో కేంద్ర ప్రభుత్వానికి కలుగుతున్న ఇబ్బందులు ఏమిటి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తులు కాపాడలేని అసమర్ధ ప్రభుత్వానికి వక్ఫ్ చట్ట సవరణ చేసే హక్కు లేదని తీవ్రంగా మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ కార్యవర్గ సభ్యులు మాస్టర్ సర్దార్ ఖాన్.జుబేర్ పుణ సాధిక్ నగర్ ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87471