ఆంధ్రప్రదేశ్
మహిళపై దాడి చేసి దొంగతనం చేసిన నిందితుడు అరెస్టు

మూడు తులాల గొలుసు రికవరీ
పోలీసులకు రివార్డులు అందజేస్తున్న సి ఐ కృష్ణయ్యయాదవ్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా సప్తగిరి లాడ్జిలో మహిళపై దాడి చేసి దొంగతనానికి పాల్పడిన నిందితుని అరెస్టు చేసినట్లు సీఐ కృష్ణయ్య యాదవ్ శుక్రవారం తెలిపారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో సీఐ కృష్ణయ్య యాదవ్ విలేకరుల సమావేశంలో దొంగను హాజరపరిచారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ ఈనెల 6వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా సప్తగిరి లాడ్జి నిర్వాహకురాలు పార్వతమ్మ పై దాడి చేసి మూడు తులాల గొలుసు, కమ్మలను దొంగిలించిన నిందితుడు బందెల దానమయ్య ను అవుకు రోడ్డులోని గోడౌన్ వద్ద అరెస్టు చేసి మూడు తులాల బంగారు గొలుసును రికవరీ చేసినట్లు తెలిపారు. అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన బందెల దానమయ్య ట్రాక్టర్ డ్రైవర్ గా వెళ్తూ జీవనం సాగించేవాడు. దానమయ్యకు భార్య చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని జులాయి గా తిరుగుతూ అప్పులు చేసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సీఐ తెలిపారు. సప్తగిరి లాడ్జిలో గతంలో రెండు సార్లు దానమయ్య వచ్చి పోయి మహిళ ఒంటరిగా ఉంటున్నట్లు గమనించి ఈనెల 6వ తేదీన పార్వతమ్మ పై దాడి చేసి మూడు తులాల గొలుసు, చెవిలో కమ్మలను దొంగిలించి నట్లు తెలిపారు. అవుకు రోడ్డు లోని గోడౌన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా బందెల దానమయ్య మోటార్ సైకిల్ పై వస్తు తమను చూసి పారిపోతుండగా పోలీసులు వెంటపడి పట్టుకున్నట్లు తెలిపారు. అతని పట్టుకొని మోటార్ సైకిల్ ను గుర్తించి అతని వద్ద తనిఖీ చేయగా మూడు తులాల గొలుసు దొరికిందన్నారు. నిందితుడు దానమయ్యను విచారించగా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా సప్తగిరి లాడ్జి లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. కమ్మలను అమ్ముకొని ఖర్చు చేసినట్లు తెలిపారని మూడు తులాల గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పోలీసులకు రివార్డు- ఆర్టిసి బస్టాండ్ ఎదురుగా సప్తగిరి లాడ్జిలో దొంగతనం చేసిన నిందితుని పట్టుకోవడం లో కష్టపడిన పోలీసులు రామకృష్ణ, నాగన్న ప్రదీప్, ప్రసాద్ లకు సీఐ కృష్ణయ్య యాదవ్ రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటసుబ్బయ్య, పోలీసులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక