ఆంధ్రప్రదేశ్
సైకిల్ గణేష్ విగ్రహం ఏర్పాటుతో మొక్కు తీరింది.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్

వినాయక మండపాలను సందర్శించిన మంత్రి టి.జి భరత్
పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు నగరంలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ సందర్శించారు. నరసింహా రెడ్డి వాటర్ ట్యాంకు వద్ద ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు భోజనం వడ్డించారు. ఆ తర్వాత ఏ.క్యాంపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మద్దూర్ నగర్, శ్రీరాం నగర్ శివాలయం వద్ద, చిన్నమార్కెట్ సిద్దేశ్వర ఆలయం వద్ద, బండిమెట్ట సర్కిల్ వద్ద, బొంగుల బజార్, చిన్నరంగరాజు వీధిలో ఏర్పాటుచేసిన వినాయకుడి విగ్రహాలను మంత్రి టి.జి భరత్ దర్శించుకున్నారు. అనంతరం పలు ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలను దర్శించుకొని భక్తులకు అల్పాహారం వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సైకిల్ వినాయకుడి విగ్రహం ఏర్పాటుచేస్తామని స్థానిక నాయకులు మొక్కుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పుడు సైకిల్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వినాయకుడిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక