ఆంధ్రప్రదేశ్
మంత్రి నారా లోకేష్ రూ.3 లక్షలు ఆర్థిక సహాయం
విజయవాడ
మంగళగిరి:-
మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కేళావత్ చరణ్ నాయక్ అస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరగనున్న ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ షటిల్ బ్యాండ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ రూ.3 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. కేళావత్ చరణ్ నాయక్ అస్ట్రేలియాలో అక్టోబర్ నెల 16 నుంచి 20 వరకు, న్యూజిలాండ్‌లో అక్టోబర్ నెల 23 నుంచి 26 వరకు జరగనున్న ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మంత్రి నారా లోకేష్ ను కలిసి రెండు దేశాలలో పాల్గొనడానికి కావలసిన ఆర్థిక సాయం చేయాలని కోరారు. స్పందించిన మంత్రి నారా లోకేష్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని చరణ్ నాయక్‌కు భరోసా ఇచ్చారు. వెంటనే ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రూ.3 లక్షలను స్థానిక నాయకుల ద్వారా చరణ్ నాయక్‌కు అందజేయించారు.

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87518