ఆంధ్రప్రదేశ్
తెలుగుదేశంపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. ఎండి.ఫిరోజ్ పై దాడి పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యానికి నిదర్శనం. సిపిఐ.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. న్యాయశాఖ మంత్రివర్యులు. శ్రీ ఎన్ఎండి ఫరూక్ తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ పై గత రాత్రి వెళుతున్న కాన్వాయ్ పై దుండగులు దాడి చేయడం పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. దాడి చేసిన దుండగులను పోలీస్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. ఎస్.బాబా ఫక్రుద్దీన్. సిపిఐ పట్టణ కార్యదర్శి కే. ప్రసాద్. వారిపై జరిగిన దాడిని ఖండించారు.
ఈ సందర్భంగా సిపిఐ మాట్లాడుతూ
నంద్యాల జిల్లా కేంద్రం అయినప్పటి నుండి పట్టణ పరిసర ప్రాంతాలలో పదుల సంఖ్యలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్న వాటిపై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టకపోవడంతో న్యాయశాఖ మంత్రి కుమారుని కి రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఫిరోజ్ పట్టణంలో పలు వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశలో ముందుకు పోతుంటే ఓర్వలేని వారు ఇలాంటి దాడులకు తెగబడడం దుర్మార్గమైన చర్యని పార్టీలో అంతర్గత సమస్యలుంటే రాష్ట్ర పార్టీ నాయకత్వంలో చర్చించాలి తప్ప ఇలాంటి దాడులకు పూను కోవడం విచారకరమని అన్నారు.
జిల్లా పోలీసు అధికారులు. ట్రాఫిక్ నిబంధన లంటూ రోడ్డుపైన జీవిస్తున్న వ్యాపారస్తులను ఆటో కార్మికులను వేధించడమే తప్ప పట్టణంలో పలు ప్రాంతాలలో నాటు సారాయి,గంజాయి, మట్కా, రౌడీ షీటర్లు దౌర్జన్యాలు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని నియంత్రించడంలో వైఫల్యం చెందుతారని , ఇప్పటికైనా జిల్లా పోలీస్ అధికారులు నంద్యాల జిల్లాలో భయ బ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టి జిల్లాలో ప్రశాంత వాతావరణ నెలకొల్పి ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసేందుకు కృషి చేయాలని సిపిఐ నాయకులు తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక