Connect with us

ఆంధ్రప్రదేశ్

భక్తిశ్రద్ధలతో మహమ్మద్ ప్రవక్త జ్ఞాపికల ప్రదర్శన ..

Published

on

కడప జిల్లా,
జమ్మలమడుగు,
ఏపీ టుడే న్యూస్:

-ప్రవక్త జ్ఞాపికలకు ప్రత్యేక ఫాతిహా నిర్వహించిన పీఠాధిపతి ..
-2000 మందికి అన్నదానం

మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా సోమవారం జమ్మలమడుగు పట్టణంలోని జామియా మసీదులో పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రి ఆధ్వర్యంలో ఘనంగా మీలాదున్నది పండుగ నిర్వహించారు.ఈ సందర్భంగా సోమ సాయంత్రం 05:30 గంటలకు జామియా మసీదులో పీఠాధిపతి మహమ్మద్ ప్రవక్త పవిత్ర జ్ఞాపికలను భక్తులకు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో మహిళలు పురుషులు పిల్లలు పెద్దలు వేలాదిగా పాల్గొని మహమ్మద్ ప్రవక్త జ్ఞాపికలను సందర్శించి తమ జీవిత కాలంలో చేసుకున్న పాపాలు మన్నించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి జ్ఞాపికలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రసాదం పంపిణీ చేశారు. మగ్రీబ్ నమాజు అనంతరం కార్యక్రమానికి హాజరైన దాదాపు 2 వేల మందికి పైగా భక్తులకు జామియా మసీదులో అన్నదానం (మటన్ బిర్యానీ) నిర్వహించారు. ప్రవక్త జ్ఞాపికలను దర్శించుకుని భక్తులందరూ తమకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, పాపాలు మన్నించాలని కోరుకున్నారు. అనంతరం పీఠాధిపతి ప్రపంచ మానవాళి క్షేమం కోసం ప్రత్యేక ఫాతెహా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురువులు సయ్యద్ షా అసద్ పాషా ఖాద్రి, గురువులు, పీఠాధిపతి కుటుంబీకులు, మహిళలు చిన్నారులు, భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.
ఫోటోరైటప్: 01: ప్రవక్త జ్ఞాపికలను ప్రదర్శిస్తున్న పీఠాధిపతి
02: కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు మహిళలు
03: భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్న దృశ్యం

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580412
Total Users : 48096