ఆంధ్రప్రదేశ్
దాడులు చేయడం మంచి పద్ధతి కాదు.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల ప్రజలు దాడులు, ఫ్యాక్షనిజాన్ని సహించరు.
నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్
నంద్యాలలో తనపై జరిగిన దాడి యత్నం సంఘటన దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలను మా కుటుంబం కాని, పట్టణ ప్రజలు కానీ సహించరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తనయుడు, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు. తనపై జరిగిన దాడి పైన సోమవారం టిడిపి కార్యాలయం (రాజ్ థియేటర్లో) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ఎండి ఫిరోజ్ వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో టిడిపిలోని మరో వర్గానికి చెందిన తమ నాయకుడి ఫోటో లేదని తనకు పదే పదే ఫోన్ చేస్తూ బెదిరింపులకు దిగారని తెలిపారు. ఆఫీస్ నుండి సాయంత్రం తాను బయటకు వెళ్తున్న సందర్భంగా ఎంఆర్ రెడ్డి అనే వ్యక్తి వాహనాన్ని ఆపి దాడికి ప్రయత్నించగా అక్కడున్న తమ అనుచరులు అడ్డుకున్నరన్నారు. నంద్యాల ప్రశాంత వాతావరణం కలిగిన పట్టణంలో ఇలాంటి సంఘటనలకు తావు లేదని, తనకు సంబంధం లేని విషయాల్లో నన్ను లాగొద్దని ఫిరోజ్ అన్నారు. ఏమైన ఉంటే ఆఫీస్ వద్దకు రమ్మన్నానని, ప్లెక్సీలో నాయకుడి ఫొటో లేకుంటే నాకు సంబంధమేంటని, అది టీడీపీ కార్యక్రమం కూడా కాదన్నారు. జనసేనకు సంబందించిన కార్యక్రమం, వాళ్ళ నాయకుడి ఫొటో ప్లెక్సీలో లేకుంటే నాపై దాడి చేస్తారా అని ఫిరోజ్ ప్రశ్నించారు. గ్రామాల్లో గ్రూపులు సహజమని, రాజకీయాల్లో ఉండగా తన గ్రూపున కాపాడుకోవలసిన బాధ్యత తమపై ఉంటుందన్నారు. అంత మాత్రాన దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. అనవసరంగా నంద్యాలలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దన్నారు. రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని నంద్యాల ప్రజలు ప్రోత్సహించారని పేర్కొన్నారు. దాడి చేసిన వారిని పోలీసులు పట్టుకొని విచారిస్తున్నారని ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68045