ఆంధ్రప్రదేశ్
వంద రోజుల ప్రణాళిక లక్ష్యాలను చేరుకోండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
వంద రోజుల ప్రణాళికలో భాగంగా శాఖల వారిగా నిర్దేశించిన లక్ష్యాలను అక్టోబర్ రెండో తేదీ లోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 100 రోజుల ప్రణాళికల లక్ష్యాల ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ వందరోజుల ప్రణాళికలో భాగంగా వ్యవసాయ శాఖకు సంబంధించి 8 పారామీటర్లలో సేంద్రియ వ్యవసాయము, సీసీఆర్సీ కార్డ్స్, ఈ పంట నమోదు పూర్తయిందన్నారు. భారీ వర్షాలకు 17,523 ఎకరాలలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహార నివేదికలను ప్రభుత్వానికి పంపామన్నారు. 400 ఎకరాలలో గుర్తించిన పండ్ల తోటల పెంపకానికి చర్యలు తీసుకోవడంతోపాటు 57 ఆయిల్ ఫామ్ ప్లాంటును ప్రోత్సహించేందుకు కృషి చేయాలన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా జిల్లాలో ఉన్న పశు సంపదకు డీ వార్మింగ్, వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. నిర్దేశించిన 650 మినీ గోకులం షెడ్లకు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. లీజులో ఉన్న 124 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, నాలుగు రిజర్వాయర్లలో చేపల పెంపక ఉత్పత్తికి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. అటవీ ప్రాంతంలో వందరోజుల ప్రణాళికలో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్ లో 1,83,600 మొక్కలను నాటామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కనీస మరమత్తులకు అత్యవసర మరమత్తులకు 32 కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామన్నారు. గత సంవత్సరం బేతంచెర్ల, డోన్, ప్యాపిలి మండలాలలో మండలాలలోని 11 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసామని, ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి ఫారం పాండ్ తవ్వకాలకు చర్యలు తీసుకోవాలని గ్రౌండ్ వాటర్, డ్వామా అధికారులను ఆదేశించారు. పర్యాటకశాఖ ద్వారా తయారుచేసిన 7 సర్క్యూట్ల బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. నందికొట్కూరులో 13వ శతాబ్దంలో నిర్మించిన సూర్యనారాయణ దేవాలయము, కొలనుభారతి దేవాలయాలకు సంబంధించిన ఫోటోల ప్రదర్శన కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద 4820 దరఖాస్తులను ఆమోద నిమిత్తం ప్రభుత్వానికి నివేదించామన్నారు. 111 పరిశ్రమలకు సింగల్ డెస్క్ విధానం ద్వారా అనుమతులు మంజూరు చేశామన్నారు. జిల్లాలోని ఫ్యాక్టరీలలో ప్రమాదాల నివారణకు గుర్తించిన లోపాలపై సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని ఆమె సూచించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖ ద్వారా గ్రామీణ మరియు పట్టణ రోడ్ల మరమ్మత్తులకు చర్యలు తీసుకోవాలన్నారు. టిడ్కో ప్రాంగణంలో ఇటీవలే మహిళా మార్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, 150 ఇళ్లకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఓడిఎఫ్, ప్లస్ సర్వే 98.13 శాతం పూర్తయిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో నిల్వ ఉన్న వర్షపు నీటిని క్లియర్ చేసి దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సిపిఓ వేణుగోపాల్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక