ఆంధ్రప్రదేశ్
తెలుగు గంగ కాలువలో పడి విద్యార్థిని మృతి.
బాలిక మృతితో కంటతడి పెట్టిన గ్రామస్తుల.
నంద్యాల జిల్లా రుద్రవరం
ఏపీ టుడే న్యూస్:
మండల పరిధిలోని ఆలమూరు గ్రామంలో 2వ తరగతి చదివే రజియా( 8) బాలిక ప్రమాదవశాత్తు తెలుగుగంగ కాలువలో పడి మృతి చెందిన సంఘటన గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బుధవారం గ్రామస్తుల వివరాల మేరకు ఆలమూరు తిప్పపై నివాసముంటున్న రఫీ కుమార్తె రజియా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుకుంటుంది. బుధవారం తిప్పపై ఉన్న తన ఇంటి నుండి పాఠశాలకు వెళ్లి సాయంత్రం పాఠశాల వదిలిన తరువాత ఇంటికి చేరే సమయంలో మార్గ మధ్యలో ఉన్న తెలుగుగంగ కాలవలోకి తోటి పిల్లలతో దిగిందన్నారు. ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడినదన్నారు. ఇది గమనించిన తోటి పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు హుటాహుటిన అక్కడికి చేరుకొని పాపను బయటకు తీసి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందడం జరిగినదని వారు తెలిపారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని కంటతడి పెట్టారు. మృతి చెందిన తమ కూతుర్ని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్వంతం అయ్యారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466