ఆంధ్రప్రదేశ్
ఘనంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణి .
షిరిడీ సాయిబాబా ఆలయంలో భక్తులకు అన్నదానం.
సీనియర్ రాజకీయ నాయకులు, రాయలసీమ ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు నంద్యాల పట్టణంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు.
గురువారం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జన్మదిన సందర్బంగా నంద్యాల ప్రభుత్వం ఆసుపత్రిలో టీడీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణి చేశారు.
అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ యం. వి. రమణారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల ఆర్ టీ సి బస్టాండ్ సమీపంలోని జమ్ములపరమేశ్వరీ ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరుపై అర్చన, అభిషేకం, తదితర ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో సాయిబాబా ఉత్సవ విగ్రహంతో పల్లకిసేవ, కేక్ కట్ చేసి భక్తులకు పంపిణి చేసి, శ్రీ సాయిబాబాస్వామికి మధ్యాహ్న హారతి ఇచ్చి సాయి భక్తులకు అన్నదానం చేశారు.
ఈ సందర్బంగా టీడీపీ నాయకులు నరహరి విశ్వనాధ్ రెడ్డి, యం. వి. రమణారెడ్డిలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రత్యేక గుర్తింపు పొంది, రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నంద్యాల పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం ఎం డి సోహెల్, టెలికామ్ సంస్థ సలహా కమిటీ సభ్యులు పెరుమాళ్ళ విజయకుమార్, పాణ్యం శ్రీనివాస్ యాదవ్, టీడీపీ నాయకులు పి. వి కృష్ణారావు, కోడూరు సంజీవరెడ్డి, పబ్బతి బొమ్మిరెడ్డి, శశిశేఖర్ శర్మ, అజయ్, సూరి, మద్దూరు పుల్లారెడ్డి, దేవనగర్ దస్తగిరి, కిరణ్ కుమార్, మనోజ్ కుమార్, పుసులూరు విజయ్, సాయిబాబా దేవాలయ వ్యవస్థాపకులు యల్లస్వామి, ప్రముఖ వ్యాఖ్యాత ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక