ఆంధ్రప్రదేశ్
విద్యార్ధి ఆత్మహత్య ప్రయత్నానికి కారణమైన నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి
కడప జిల్లా
కడప

కడప నగరంలోని హరి టవర్స్ దగ్గర ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో చదువుతున్న చైతన్య అనే విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నానికి చేయగా విద్యార్థిని కడప రిమ్స్ కి తరలించారు. వెంటనే సమాచారం తెలుసుకున్న ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి వారి బృందం విద్యార్థిని రిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించడం జరిగింది. అలాగే సమాచారం అడగగా నారాయణ విద్యాసంస్థలు విద్యార్థులని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అలాగే వైస్ ప్రిన్సిపల్ మరియు సిబ్బంది అందరూ కూడా తిడుతూ కొట్టారని ఆ అవమానాన్ని భరించలేక వాజ్మాయిల్ తాగడం జరిగిందని తెలపడం జరిగింది. విద్యార్థి ఆరోగ్యం విషమంగా ఉందని వారు అన్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలు ఫీజులు దోపిడీతో విద్యార్థుల జీవితాలతో, ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. సంఘటన జరిగి కొన్ని గంటలవుతున్న కనీసం విద్యార్థి ఆరోగ్యం గురించి జిల్లా విద్యాశాఖ అధికారులు ఏమాత్రం చొరవ చూపలేదు. గతంలో కూడా అదే విద్యా సంస్థల్లో అనేకమంది విద్యార్థులకు యాజమాన్యం కొట్ట గా చేతులు విరగడం వంటివి అనేక ప్రమాదాలు జరిగాయి దీనిపైన విద్యాశాఖ అధికారులు పట్టించుకోనందువలన అధికారుల పరివేక్షణ లోపంలోనే విద్యార్థులకు అనేక సంఘటనలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కూడా విద్యార్థి కి మెరుగైన వైద్యం అందించాలని అదే విదంగా ఆత్మహత్య ప్రయత్నానికి కారణమైన నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థుల పక్షాన ఆందోళన చేపడతామని వారు అన్నారు ఈ కార్యక్రమం లో వినయ్, పండు తదితరులు పాల్గొన్నారు..
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68125