ఆంధ్రప్రదేశ్
అయ్యలూరు ఉర్దూ విద్యార్థులకు జమాఆతె ఇస్లామి హింద్ “వర్క్ బుక్స్” వితరణ.

పిల్లలకు మంచి విద్యాబుద్దులు ఇప్పించడమే తల్లితండ్రుల ఉత్తమ బాధ్యత సమద్.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల మండలం అయ్యలూరు , మండల పరిషత్ ప్రాథమికోన్నత ఉర్దూ పాఠశాలలో ప్రాధమిక తరగతులు చదివె విద్యార్ధులకు జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో ఉర్దూ లాంగ్వేజ్, లెక్కల వర్క్ బుక్కులు వితరణ చేసారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్ ముఖ్య అతిథిగా హాజరై మెటిరియల్ పంపిణి చేసారు. ఈ సందర్భంగా సమద్ హాజరైన విద్యార్థుల తల్లితండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలకు మంచి విద్యా బుద్దులు ఇప్పించడం తమ పవిత్ర బాధ్యతగా భావించాలని అది ప్రవక్త ముహమ్మద్ (స) సాంప్రదాయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ భాషాభివృద్ధికి మంచి ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ అజీజ్ తన ఉపాధ్యాయ బృందం కృషితో పాఠశాలను మోడల్ పాఠశాలగా అభివృద్ధి చేయడం అభినందనీయం, మంచి ఉపాధ్యాయులు ఉండటం అయ్యలూరు ప్రజల అదృష్టం అన్నారు. హెచ్ యం అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ అబ్దుల్ సమద్ గారు ఉర్దూ భాష అభివృద్ధికి, ఉర్దూ పాఠశాలలు బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తుంటారని తెలిపారు. తదనంతరం అబ్దుల్ సమద్ ను ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉర్దూ మానిటరింగ్ ఆఫిస్ యూనూస్ బాషా ఖురేషి, పాఠశాల విద్యా కమిటి ఛైర్మెన్ ఎస్.మాలన్ బి, భిద్మత్ బ్యాంకు మేనేజర్ ఫయాజ్, గోల్డెన్ బేకరి పీ వి ముస్తఫా, షఫీ, యూనూస్ ఉపాధ్యాయులు కలీముల్లా, షబానా పర్విన్,అఖిల బాను నాగరాజు, నాసిరా , విధ్యార్ధుల తలిదండ్రులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక