ఆంధ్రప్రదేశ్
ఘనంగా టేలర్ హై స్కూల్ నందు సైన్స్, మ్యాస్ ఫెయిర్ కార్యక్రమం (వీడియో )
చిత్తూరు జిల్లా
కుప్పం నియోజకవర్గంలో
కుప్పం పట్టణంలోని టేలర్ హై స్కూల్ నందు పూర్వపు విద్యార్థుల సంఘం తరఫున పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ సుదర్శన్ ఆధ్వర్యంలో సైన్స్, నైస్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పిఎస్ మునిరత్నం, అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ హెడ్ సురేష్, పాఠశాల పూర్వపు విద్యార్థుల కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు, కడా పిడి వికాస్ మరమత్ తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ముందుగా పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సంగీత కన్నన్ మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థి నాయకులను ఎన్నుకోవడానికి తొలిసారిగా పద్ధతిలో ఓటింగ్ నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ ఎన్నికలలో పాఠశాల విద్యార్థి నాయకుడిగా 9వ తరగతి గిరీష్ తో పాటు మరి కొంతమంది విద్యార్థి నాయకులను ఎన్నుకున్నట్టు తెలిపారు.
విద్యార్థి నాయకులతోపాటు వివిధ తరగతులలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.
అనంతరం పాఠశాల విద్యారి నాయకులతో పాటు హౌస్ సభ్యులు ముఖ్య అతిథులకు గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. అలాగే పాఠశాల ఔనత్యాన్ని గురించి వివరిస్తూ పాఠశాల ప్రారంభకులు ఎస్ జి టేలర్, సిపి టేలర్ లను అభినందించారు. వారిని ఆదర్శంగా తీసుకుని పాఠశాలను నడిపిస్తున్న పూర్వపు విద్యార్థులను అభినందిస్తూ, పాఠశాల తరఫున ప్రతి సంవత్సరం 50 మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందజేయడం గర్వించదగ్గ విషయమన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68135