ఆంధ్రప్రదేశ్
పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే…….

యల్ యన్ మద్దిలేటి
రుద్రవరం విలేకరి.
రుద్రవరం ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థులు 5గురు ఎంబీబీఎస్ సీట్లు సాధించిన సందర్భంగా ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం ఘన సన్మానం….
నంద్యాల జిల్లా రుద్రవరం
ఏపీ టుడే న్యూస్
నీట్లో స్టేట్ ర్యాంక్లు సాధించిన రుద్రవరం ఆదర్శ పాఠశాలకి చెందిన 5 గురు పూర్వ విద్యార్థులు మెడికల్ సీట్లు పొందారు.
రుద్రవరం కి చెందిన బిందూ, ఛాయా దేవి, లోకేష్, జె.పూజిత(బి.నాగిరెడ్డపల్లె), శరత్ 5 గురు కూడా జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలలో సీటు సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి శని వారం వారిని అభినందించి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి మంచి స్థాయి కి ఎదిగి దేశానికి ,మన రాష్ట్రానికి, గ్రామానికి సేవ చేయాలి అని అన్నారు.ఈ 5 గురు మన పాఠశాల లో ఉన్న 600 మందికి స్ఫూర్తి అన్నారు. “ఇష్టపడి కష్టపడితే” ఏదైనా సాధ్యమే అని అన్నారు. రుద్రవరం మండలం నుంచి 5 గురు విద్యార్థులు ఎంబిబిఎస్ సీట్లు సాధించడం ఎంతో అభినందనీయమని అన్నారు. మీరు మండలానికి మాత్రమే కాదు, మనందరికీ ఆదర్శమే.మన పాఠశాలలో 6 వ తరగతి నుండి 10 వరుకు చదివి మంచి మార్కులు సాధించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను.
అదే బాటలో,అదే విధంగా ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ బాగా చదివి, మన మండలానికి మంచి పేరు, మన స్కూలుకి మంచి పేరు తేవాలని ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం కోరుకుంటూ వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ, విద్యార్థులు తల్లి తండ్రులు పాల్గొన్నారు. ఎంబిబిఎస్ సీట్లు సాధించిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను ప్రిన్సిపాల్ కొనియాడారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక