ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం లో ఉర్దూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రణాళిక ప్రకారం ఉర్దూ భాష ను అభివృద్ధి పరుస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ
నంద్యాల పట్టణములోని జొయ ఉర్దూ కొచింగ్ డైరెక్టర్ సి అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో సాయి బాబా నగర్ లో గల కూబ్ర షాది ఖానా లో సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రచురితమైన టేట్ – 2024 ఉర్దూ మెటీరియల్ ను ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా టేట్ – 2024 ఉర్దూ మెటీరియల్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్రం లో ఖాళీ గా ఉన్న ఉర్దూ పోస్టుల భర్తీకి ప్రత్యేక ఉర్దూ డి. ఎస్. సి జరుపుట కు, సమగ్ర శిక్ష సపోర్టెడ్ అరబిక్ మద్రసలలొ, 2017 లో అప్గరెడ్ ఆయన ప్రాధమికున్నత ఉర్దూ పాఠశాలల లో విద్యవాలీంటర్లను నియమించటకు, ప్రభుత్వ జూనియర్ ఉర్దూ కాలేజీ లో గెస్ట్ ఫ్యాక్టల్టీ హనొరొరియం ( జీతాలు) పెంచుట కు 23 వ తేది ముఖ్యమంత్రి తొ జరిగే సమావేశంలో చర్చించి పలు ఉర్దూ సమస్యల ను పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా లో మైనారిటీ విద్యార్థుల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కీల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయుటకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని పక్కనే ఉన్న జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అభివృద్ధి ఆఫిసర్ సబిహ గారిని ఆదేశించారు. ఉర్దూ టేట్ – 2024 ఉచిత మెటీరియల్ మాదిరిగా తెలుగు మాధ్యమం లో టేట్ – 2024 మెటీరియల్ ను మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత పంపిణీ చేయుటకు కృషి చేస్తానని తెలిపారు. నంద్యాల జిల్లా లో జొయ ఉర్దూ కొచింగ్ ఆధ్వర్యంలో ఉర్దూ విద్యార్థులకు దిశ నిర్దారణ చేస్తూ, ఆంధ్ర ప్రదేశ్ ఉర్దూ టిచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ గా ఉర్దూ పాఠశాలల బలోపేతం చేసేందుకు, ఉర్దూ భాష అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న సి. అబ్దుల్ అజీజ్ ను, జొయ ఉర్దూ కొచింగ్ ఉపాధ్యాయు బృందానికి అభినందించారు.
తదనంతరం జొయ ఉర్దూ కొచింగ్ తరుపున మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి జ్ఞాపిక అందచేశారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , డి. ఎమ్. డెబ్లీయు, సబిహ పర్వీన్, అయమ్మా, ఉల్మా సంఘం అధ్యక్షులు హఫీజ్ అంజద్ భాష సిద్దీఖి, సమగ్ర సమగ్ర శిక్ష రాష్ట్ర ఉర్దూ కొ. ఆర్డీనెటర్ అబ్దుల్ గని, ఉర్దూ డి. ఐ, హస్మౌద్దీన్, జొయ ఉర్దూ కొచింగ్ అసోసియేట్ ప్రెసిడెంట్ సి. ఫజలుర్ రెహమాన్, ఆంధ్ర ప్రదేశ్ ఉర్దూ టిచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, షమీమ్ బాను, అంజద్ షరీఫ్, నాయకులు ఎన్. ఎమ్. డి. ఇబ్రహీం, షబానా పర్వీన్, ఇలియాస్ పెద్ద సంఖ్యలో ఉర్దూ విద్యార్థులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక