ఆంధ్రప్రదేశ్
సంక్షోభంలో సంక్షేమం అందించి, అభివృద్ధికి రెక్కలు తొడిగిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. “ఇది మంచి ప్రభుత్వం” 2వ రోజు కార్యక్రమం నంద్యాల నియోజకవర్గ గోస్పాడు మండలం ఎంపీడీవో ఆఫీస్ ముందర ప్రారంభించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత “ఇది మంచి ప్రభుత్వం” అని అనిపించుకుంటుందన్నారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అవ్వ తాతలకు పెన్షన్ 4,000 వేలు అందించడం, దివ్యాంగులకు 6,000 వేలు ఇవ్వడం, నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ పై సంతకం చేయడం, అనుకోకుండా వచ్చిన వరదలు విజయవాడలో ముంచెత్తడంతో చంద్రబాబు నాయుడు ఆప్తుడుల నిలిచి సహాయ సహకారాలు అందించి విజయం సాధించారని బాధితులను గట్టున వేశాడని కొనియాడారు. తీవ్ర విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో సఫలీకృతమయ్యారని మునిగిన ఇంటికి 25,000వేలు తక్షణ సహాయం అందించి వరద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపద్బాంధవుడులా నిలిచారని కొనియాడారు. నెల నెలా ఒకటవ తేదీన ఉద్యోగులకు వేతనాలు జమ చేయడం, అమ్మలాగా లక్షల మందికి అన్నా క్యాంటీన్ ద్వారా ఆకలి తీర్చడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, దౌర్జన్యాలు అరాచకాలకు నిలువరించి శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి రహిత సమాజ స్థాపన, భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి శాంతి భద్రతల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , ఎండిఓ నాగ అనసూయ , డిఏఓ మురళీధర్ , ఎమ్మార్వో షేక్ మొహిద్దిన్ , ఎంఈఓ కరిముల్లా , ఎంఈఓ సురేంద్రనాథ్ , ఏవో స్వప్నిక రెడ్డి , వెటర్నరీ ఆఫీసర్ ఉమా రెడ్డి మరియు గోస్పాడు మండలం టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక