ఆంధ్రప్రదేశ్
రేపు అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్న మంత్రి
రేపు అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్న మంత్రి
నగరంలో పునరుద్ధరించిన రెండు అన్న క్యాంటీన్లను సోమవారం రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖల మంత్రి టి.జి. భరత్ పునః ప్రారంభించనున్నారు. తొలుత ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఆవరణలోని, అనంతరం కొండారెడ్డి బురుజు సమీపంలోని అన్న క్యాంటిన్లను మంత్రితో పాటు జిల్లా కలెక్టరేట్ పి.రంజిత్ బాష, జాయింట్ కలెక్టర్ బి.నవ్య, నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కాగా ఒక్కొక్క అన్న క్యాంటీన్‌ను నగరపాలక రూ.10 లక్షలు వెచ్చించి ఆధునీకరించిన సంగతి విదితమే.
———————————————————
*ఏఐసిఎం సమావేశానికి పయనమైన మేయర్*
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దివాస్ నగరంలో సోమవారం జరిగే అఖిల భారత మేయర్ల మండలి (ఏఐసిఎం) కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు నగర మేయర్ బి.వై. రామయ్య ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఏఐసిఎం జాతీయ అధ్యక్షురాలు మాధురీ అతుల్ పటేల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యుడు హోదాలో మేయర్ బి.వై. రామయ్య పాల్గొనున్నారు. సమావేశంలో ఏఐసిఎం రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు, మేయర్లకు శిక్షణ తరగతులు, కార్యాలయ పునరుద్ధరణ వంటి 9 అజెండాలతో పాటు ఇతరత్రా అంశాలపై చర్చించనున్నారు.
———————————————————
*రేపు నగరపాలకలో వినతుల స్వీకరణ*
నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలకకు సంబంధించి ఏవైనా స్థానిక సమస్యలుంటే అర్జీలు ఇవ్వగలరని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుండి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466