ఆంధ్రప్రదేశ్
రూ10 కోట్ల విలువైన పార్కు స్థలం పందులకు పాములకు నిలయంగా మారినా…పట్టించుకోని పాలకవర్గం
శ్రమదానంతో పిచ్చి మొక్కలు,జెసిబి తో కంప చెట్లు తొలగించిన స్థానిక కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో 
కర్నూలు శివారు కాలనీల ప్రజలు నిబంధనల ప్రకారం రూ.కోట్ల విలువైన స్థలాలను
నగరపాలక సంస్థకు అప్పజెప్పి ఏళ్లు గడుస్తున్న కనీసం మొక్కలు కూడా నాటకుండా పార్కుల అభివృద్ధిని గాలికి వదిలేసారని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగి లేని పుల్లారెడ్డి, స్థానిక కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు పి సుకుమార్, వి వెంకటేశ్వర్లు, పి ఆంజనేయులు విమర్శించారు. రేడియో స్టేషన్ సమీపంలోని పార్థసారధి నగర్ లో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు శ్రమదానంతో పార్కులో పిచ్చి మొక్కలను తొలగించారు. కంప చెట్లను జెసిపి తో తొలగించి పార్కును చదును చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు ఎకరా విస్తీర్ణంలో 10 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని స్వాధీనం చేసి ఏళ్లు గడుస్తున్న ఎలాంటి అభివృద్ధి చేయనందువలన పాములకు పందులకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పార్కులకు కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశారని, అవసరం లేని చోట్ల రోడ్ల పక్కన రోడ్లు వేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని విచ్చిస్తున్నారని తెలిపారు. ఇండ్ల పన్నులు పెంచడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరచడం పై లేదన్నారు. కర్నూలు నగర పాలక సంస్థ పాలకవర్గం శివారు కాలనీల పార్కులను పట్టించుకోవడం లేదన్నారు.అసమానతలు లేని అభివృద్ధిని చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ గారు పాలకవర్గం వెంటనే స్పందించి శివారు ప్రాంత కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఈ పార్కు కాలనీ, పార్థసారధి నగర్, సురేష్ హోమ్స్,గీతాంజలి,సన్ రైస్ కాలనీల ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు ఈ శ్రమదానంలో కే శ్రీనివాసులు,ఏ ధర్మరాజు, ఎన్ పీటర్, వెంకటరెడ్డి, వీరేశ్, శీను, దివాకర్ తదితరులు పాల్గొన్నారు
అభివందనములతో
ఇరిగినేని పుల్లారెడ్డి
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466