ఆంధ్రప్రదేశ్
వైద్య విద్యార్థుల పరిశోధనార్థం రిటైర్డ్ అగ్రికల్చరల్ ప్రొఫెసర్ దేహదానం
కడప జిల్లా :
కడప
కదిరి వ్యవసాయ పరిశోధనా కేంద్రం లో పనిచేస్తూ రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ పూడూరు నరసింహారెడ్డి(86) ఈరోజు తెల్లవారుజామున ఒంటిగంటకు ప్రొద్దుటూరు లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఈయన తిరుపతి అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేశారు. అలాగే కదిరి వ్యవసాయ పరిశోధనా కేంద్రం లో శాస్త్ర వేత్త గా పనిచేశారు. వేరుశనగ లో వేమన అనే వంగడాన్ని అభివృద్ధి చేయడంలో వారి బృందానికి నాయకత్వం వహించారు. ఈయన విరసం వరలక్ష్మి స్వయానా పెదనాన్న. ఆయన బ్రతికుండగానే తన శరీరాన్ని దానం చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. రిమ్స్ హాస్పిటల్ కడపకు సాయంత్రం ఐదు గంటలకు శరీరాన్ని ఆయన భార్య లీలావతి అనుమతితో అప్పగించారు. ఈసందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దేహదానం చేయడం అరుదైన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓబుళరెడ్డి, విరసం వరలక్ష్మి, పల్లవోలు రమణ, డాక్టర్ భాస్కర్, సృజన శీనన్న, నాగార్జున రెడ్డి, ఎఐయస్ఎఫ్ వలరాజు, ప్రతాప్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, శివరాం,అనాటమి డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87484