ఆంధ్రప్రదేశ్
దేశం గర్వపడే స్థానంలో కర్నూలు జిల్లా క్రీడాకారిణి

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ లో నాలుగు పతకాలు సాధించిన వారిని సత్కరించుకోవడం గర్వకారణం*
*జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా*
దేశం గర్వపడే స్థానంలో కర్నూలు జిల్లా క్రీడాకారిణి రేష్మా పవర్ లిఫ్టింగ్ సీనియర్ విభాగంలో నాలుగు పతకాలు సాధించడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా క్రీడాకారిణిని అభినందించారు.సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నేపాల్ లో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సీనియర్ విభాగంలో నాలుగు పతకాలు (3 స్వర్ణాలు, 1 సిల్వర్) సాధించిన రేష్మ ను శాలువ, పుష్పగుచ్చంతో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేపాల్ దేశంలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ 57వ (సీనియర్) విభాగంలో కర్నూలు జిల్లా, బ్రాహ్మణకొట్కూరుకు చెందిన రేష్మ నాలుగు పతకాలు (3 స్వర్ణలు, 1 సిల్వర్) సాధించడం గర్వకారణం అని కలెక్టర్ తెలిపారు. ఈ పతకాలను సాధించడానికి క్రీడాకారిణి నాలుగు సంవత్సరాలుగా శిక్షణ తీసుకొని పతకాలు సాధించడం చాలా సంతోషం అన్నారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి జిల్లాలోని ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. అలాగే క్రీడార రంగంలో రాణించిన క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అండదండలు అందిస్తుందని తెలిపారు.అనంతరం క్రీడాకారిణిని శాలువ, పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఎస్డిఓ భూపతి రావు, పవర్ లిఫ్టింగ్ శిక్షకుడు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక