ఆంధ్రప్రదేశ్
కర్నూలు జిల్లా అభివృద్దే తన లక్ష్యం.. ఎం.పి బస్తిపాటి నాగరాజు (వీడియో)

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
151 సీట్లు వచ్చాయని విర్రవీగిన జగన్ కు, ఈ ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లు ఇచ్చి గుణపాఠం చెప్పారు
…ఒక తండ్రి కొడుకు భవిష్యత్తు కోసం ఎలా తపన పడతాడో, రాష్ట్ర అభివృద్ధి కోసం సీ.ఎం. చంద్రబాబు అలా తపిస్తున్నాడు
ఒక తండ్రి కొడుకు భవిష్యత్తు కోసం ఎలా తపన పడతాడో , రాష్ట్ర అభివృద్ధి కోసం సీ.ఎం చంద్రబాబు అలా తప్పిస్తున్నాడని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. పెద్ద కడుబూరు మండలంలోని పెద్ద కడుబూరు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో టిడిపి మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించిన ఎం.పి, ఇంచార్జిలు.. కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో నెరవేర్చిన హామీలతో పాటు, రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు.. అనంతరం ఎం.పి నాగరాజు మాట్లాడుతూ 151 సీట్లు వచ్చాయని విర్రవీగిన జగన్ కు, ఈ ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లు ఇచ్చి పెద్ద గుణపాఠం చెప్పారన్నారు..రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ కోలుకునే పరిస్థితి లేదని, వైసీపీది ముగిసిన అధ్యాయమని ఎద్దేవా చేశారు.. జగన్ ఐదేళ్ల విధ్వంస, రాక్షస పాలనలో రాష్ట్రం వెనుకబడిందని మండి పడ్డారు..రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యమవుతుందని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారన్నారు..ఇక కర్నూలు జిల్లా అభివృద్దే తన లక్ష్యమన్న ఎం.పి నాగరాజు ఈ ఐదేళ్లలోపు జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు..ఈ కార్యక్రమంలో బిజెపి ఇంచార్జ్ విష్ణు వర్ధన్ రెడ్డి, జనసేన ఇంచార్జ్ లక్ష్మన్న , రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ,మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న తదితరులు పాల్గొన్నారు..
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక