ఆంధ్రప్రదేశ్
ఎట్టి మాలలను ప్రభుత్వం గుర్తించాలి.స్మశాన వాటికలలో మౌలిక వసతులు కల్పించాలి..స్టేట్ ప్రెసిడెంట్ గోసుల ఇషాక్ ..*

ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప- నంద్యాల జిల్లా.
సిరివెళ్ళ 🙁 బోయిలగుంట్ల గ్రామం ) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తర తరాలుగా వెట్టి చాకిరీ చేస్తున్న ఎట్టి మాలలను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని మాల శ్మశాన వాటికల కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొసుల ఇష్షాక్ కోరారు.
పట్టణాలలో గ్రామాలలో ఎట్టి మాలలు బేగరులుగా జీవనం సాగిస్తూ నిరుపేద బతుకులు అనుభవిస్తూ సమాజంలో సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో వెనుక బాటు ధనాన్ని అనుభవిస్తున్నట్లు ఇషాక్ తెలియ జేశారు.
గ్రామాల్లో పట్టణాల్లో ఏవైనా మరణిస్తే గుంత తీసి గాని కట్టెలు పూడ్చి గాని వారి వారి సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నామని గోసుల జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన వినతి పత్రంలో స్పష్టం చేశారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి మాలల కష్టాలను పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలలో ఎట్టి మాలల సంక్షేమానికి సముచిత స్థానం కల్పించాలని గో సు ల ఇషాక్ డిమాండ్ చేశారు.
ఎట్టి మాలలకు ప్రభుత్వం గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు తక్షణమే అందివ్వాలన్నారు.
ఎస్సి కార్పొరేషన్ ద్వార భూమిలేని నిరుపేదలకు 2 ఏకారాలు భూమి కొనుగోలు చేసి పంపిణీ చేసి జీవనోపాధి కల్పించాలన్నారు.
స్మశాన వాటికలు లేని గ్రామాల్లో 2 ఎకరాల్లో భూమి కేటాయించి నీరు మరియు గది వసతి కల్పించాలని గో సు ల ఇషాక్ సూచించారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ తో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓ సత్యనారాయణప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక