ఆంధ్రప్రదేశ్
కూటమిపాలనలో సూపర్ సిక్స్ ఎక్కడ ?..ఎమ్మెల్యే విరూపాక్షి
ఏపీ టుడే న్యూస్,పత్తికొండ/ఆలూరు:
వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే లడ్డూ వివాదం తెరపైకి…
ఏడాది మాత్రమే చంద్రబాబు ప్రభుత్వానికి అవకాశం…
కూటమి పరిపాలనలో సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అని తమ వైఫల్యాలను చంద్రబాబు ప్రభుత్వం కప్పిపుచ్చుకునేందుకు కొత్తగా తిరుమల లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆలూరు శాసనసభ్యులు విరుపాక్షి పేర్కొన్నారు. గురువారం ఆయన దేవనకొండలోని ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సూపర్ సిక్స్ పథకాలు అడగకూడదని ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదని ఎత్తుగడతోనే కూటమి ప్రభుత్వం అనేక ఆరోపణలను గత వైసిపి ప్రభుత్వం పైన వేస్తూ కాలయాపన చేస్తుందని విమర్శించారు. గత ఐదు సంవత్సరాల లో వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు సుఖశాంతులతో ప్రశాంతంగా జీవించాలని జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలతో పాటు చెప్పని అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టి పేదలను ఆర్థికంగా బలోపేతం చేశారన్నారు. ఈ ప్రభుత్వము పథకాలు ప్రవేశపెట్టడానికి ఒక ఏడాది మాత్రమే గడువు ఇస్తామని అనంతరం ప్రజల చేత ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భర్త లుముంబా, జెడ్పిటిసి కిట్టు,కన్వీనర్ తపాలా శ్రీనివాసులు, కప్పట్రాళ్ల దివాకర్ నాయుడు,సర్పంచ్ అరుణ్ కుమార్,గఫుర్,చంద్రన్న,ప్రతాప్,రాజన్న,బాబు,ఆనంద్,తిరుమలేష్,శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68106