ఆంధ్రప్రదేశ్
స్నేహితునికి రూ33 వేల ఆర్థిక సహాయం అందజేసిన 2006- 2007 బ్యాచ్ పూర్వ విద్యార్థులు.
ఏపీ టుడే న్యూస్,
నంద్యాల జిల్లా రుద్రవరం.
రుద్రవరం మండలంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో2006- 2007 బ్యాచ్ లో 10 వ తరగతి పూర్వ విద్యార్థులు తమ తో చదివిన స్నేహితుడికి 33 వేల రూపాయలు ఆర్థిక సహకారం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే తువ్వపల్లె కు చెందిన మొబ్బు బాల నరసింహుడు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న స్నేహితులు తమ వంతుగా 33 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కూడా తమ తోటి స్నేహితులకు ఆపద సమయంలో అండగా ఉన్నామని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాశిం, అనిల్, గపూర్, ప్రతాప్ ,మస్తాన్ హుస్సేన్ ,బాల చౌడయ్య , బాల వెంకటయ్య , పాములేటి, నరసింహ, నాగరాజు, జగన్, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87236