ఆంధ్రప్రదేశ్
గీతారత్న పురస్కార గ్రహీత డి.వి. రమణకు ఘన సన్మానం
..భగవద్గీత వ్యాప్తికి డి.వి.రమణ కృషి ప్రశంసనీయం.. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి
..ధార్మిక సంస్థలకు డి.వి రమణ స్పూర్తి.. చిన్మయ మిషన్ కర్నూలు జిల్లా బాధ్యులు స్వామిని సుప్రేమానంద
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు నగరంలోని శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి భగవద్గీత ప్రచార సంఘం అధ్యక్షులుగా ఉంటూ, దాదాపు 40 సంవత్సరాలుగా భగవద్గీత వ్యాప్తికి కృషి చేస్తు, వివిధ ధార్మిక సంస్థలకు మాతృ సంస్థగా ఉంటూ, ఆదర్శంగా నిలిచిన డి.వి. రమణకు గీతా రత్న పురస్కారం లభించడం అభినందనీయమని పలువురు ధార్మిక సంస్థల ప్రతినిధులు కొనియాడారు. కర్నూలు నగరంలోని సంకల్‌బాగ్‌లో ఉన్న గీతా ప్రచార ధామంలో డి.వి రమణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ ధార్మిక సంస్థలకు వారు స్పూర్తిదాయకంగా నిలిచారని, అంకితభావంతో, క్రమశిక్షణతో, నమ్మిన సిద్ధాంతం కోసమే జీవిస్తున్న వ్యక్తి అని కొనియాడారు. చిన్మయ మిషన్ కర్నూలు బాధ్యులు స్వామిని సుప్రేమానంద మాట్లాడుతూ సమాజంలోని అన్ని రంగాలలో సేవలందిస్తున్నటువంటి వారికి అవార్డులు, రివార్డులు, పురస్కారాలు ఇస్తున్నారు కానీ ధార్మిక సేవ చేస్తూ సమాజంలో శాంతి సుస్థిరతలకు, సమైక్యతకు పాటుపడుతున్న వ్యక్తులను గుర్తించి, గౌరవించి, సన్మానించుకోవాలనే స్పృహ సమాజంలో కొరవడిందని, ఆ పనికి కర్నూలు గోదాగోకులం, ఆవొపా తదితర సంస్థలు ముందుకు రావడం అభినందనీయ మన్నారు. గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త మాట్లాడుతూ భక్తునికి చేసే సన్మానం భగవంతునికి చేసినట్లేనని, ఇటువంటి గొప్పవ్యక్తికి సన్మానం చేసే అవకాశం కలగడం గోదాగోకులం భాగ్యమని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు టి.సి. మద్దిలేటి, గణేశ్ ఉత్సవసమితి అధ్యక్షులు డాక్టర్ మోక్షేశ్వరుడు, శ్రీసీతారామకళ్యాణ మహోత్సవ సమితి సభ్యులు నాగోజీరావు, మహాబలేశ్వర్, జగన్నాధ గుప్త, ఇల్లూరి రమణ, సింహాద్రి రమేశ్ మరియు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు డి.వి.రమణను కర్నూలు జిల్లా ధార్మిక సంస్థలకు మార్గదర్శి అని కొనియాడారు. తదనంతరం దుశ్శాలువ, పూలమాలలతో సన్మానించారు. ఏకాదశి సందర్భంగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68153