ఆంధ్రప్రదేశ్
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 24 అర్జీలు వచ్చాయి. వాటన్నింటినీ త్వరితగతిన గడువులోపు పరిష్కారించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ, ఆరోగ్యధికారి డా. వి.విశ్వేశ్వర రెడ్డి, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఎస్.ఈ. జి.రాజశేఖర్, ఆర్‌ఓ జునైద్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంఈ సత్యనారాయణ, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, టిడ్కో అధికారి పెంచలయ్య, డిపిఓ ఉమోష్ తదితరులు పాల్గొన్నారు.
*వచ్చిన ఆర్జీల్లో కొన్ని..*
1. టిడ్కో గృహాల నందు అనర్హులు కాబడి, తాము చెల్లించిన డిడి నగదును రీఫండ్ చేయాలని పలువురు అర్జీలు ఇచ్చారు.
2. గణేష్ నగర్-2, రామ్‌నగర్ శివాలయం నుండి జోహరపురం వెళ్ళు మార్గంలో మెటల్ రోడ్డు నిర్మించాలని స్థానికులు సత్యనారాయణ, చంద్రశేఖర్, బి.మోహన్ తదితరులు కోరారు.
3. నెహ్రూ ఆటో నగర్ నందు మురుగు కాల్వలు నిర్మించాలని స్థానిక కాలనీ అసోసియేషన్ నాయకులు నిజమోద్దిన్, కరుణాకర్ బాబు తదితరులు కోరారు.
4. గోఖారి నగర్ నందు రహదారులు, మురుగు కాల్వలు, నీటి వసతి మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు వెంకటస్వామి కోరారు.
5. ఒమోగ హాస్పిటల్ వద్దనున్న శ్రీవారి సుదర్శనము కాలనీ నందు తాగునీటి పైప్‌లైన్ లేక ఇబ్బందిగా ఉందని, స్థానిక కాలనీ అసోసియేషన్ నాయకులు రఘునాథ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కోరారు.
6. మారుతి నగర్ నందు పెద్దవంకపై కల్వర్టులు, రహదారులు, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని స్థానికులు రాధాకృష్ణ, రామాచారి, సత్తెయ్య, వెంకటేశ్వర్లు, మద్దిలేటి తదితరులు కోరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87507