ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టండి – జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
*కర్నూలు,ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య స్వీకరించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని ఏ ఒక్క అర్జీ కూడా బియాండ్ ఎస్ఎల్ఎ వెళ్లకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏట్ టు వ్యూ (ఇప్పటి వరకు చూడని) దరఖాస్తులకు సంబంధించి 15 ఉన్నాయని వాటిని అధికారులు ఓపెన్ చేసి సమస్యను పరిశీలించి బియాండ్ ఎస్ఎల్ఎ కు వెళ్లకుండా పరిష్కరించాలన్నారు. అదే విధంగా బియాండ్ ఎస్ఎల్ఎ కు సంబంధించి 3 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రీఓపెన్ దరఖాస్తులకు సంబంధించి 22 ఉన్నాయని అందులో రెవెన్యూ కు సంబంధించి 12, పోలీసు 6, పంచాయతీ రాజ్ 3 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ముందు వాటికి సరైన ఎండార్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేయాలన్నారు. సిఎంఓ గ్రీవెన్స్ లకు సంబంధించి 25 పెండింగ్ లో ఉన్నాయని వాటిని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.అదే విధంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఆఫీసు సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు డిఆర్ఓకు అందజేయాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
*సమావేశంలో ఇంఛార్జి డిఆర్ఓ చిరంజీవి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక