తెలంగాణ
జూలై 7 నుంచి హైదరాబాద్ లో బోనాల్ : ధూం ధామ్
హైదరాబాద్:
నగరంలో జులై 7 నుంచి బోనాలు వేడుకలు జరుగ నున్నాయి. గోల్కొండలోని జగదాంబికా గుడిలో మొదలు కానున్నది.
హిందువుల క్యాలండర్ ప్రకారం ఆషాడంలో బోనాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరుగుతుంది. భక్తులు అమ్మవారికి నైవేద్యం పెడతారు. అలంకరించిన కుండల్లో సమర్పిస్తారు.
హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది బోనాలు మూడు దశలలో జరుగుతుంది. వాటిని గోల్కొండ బోనాలు, లష్కర్ బోనాలు, ఉజ్జయినీ మహంకాళి బోనాలు అని జరుపుకుంటారు.
హైదరాబాద్ లోని హరీబౌలి లో ఉన్న శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి గుడి, లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి గుడిలో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. 150 ఏళ్ల క్రితం కలరా మహమ్మారి రావడంతో తొలిసారి ఈ బోనాలు పండుగ వేడుకలు జరుపుకున్నారని చరిత్ర చెప్తుంది…
మహంకాళి అమ్మవారి ఆగ్రహం కారణంగానే నాడు కలరా వ్యాపించిందని ఓ నమ్మకం. అప్పటి నుంచి అమ్మవారికి బోనాలు వేడుకలు జరుపుకుంటు న్నారు హైదరాబాద్ నగర ప్రజలు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87461