ఆంధ్రప్రదేశ్
పిచ్చికుక్కదాడి ఘటన బాధితులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

కర్నూల్లోని ఓల్డ్ టౌన్‌లో పిచ్చికుక్క దాడి చేయడం ఎంతో బాధాకరమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. కుక్క దాడిలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి మంత్రి టి.జి భరత్ పరామర్శించారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ చిన్నారులపై పిచ్చికుక్క దాడి ఎంతో బాధాకరమన్నారు. విషయం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అందరికీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యసేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కుక్కదాడిలో గాయపడిన వారికి తక్షణ ఖర్చుల నిమిత్తం మున్సిపల్ కార్పొరేషన్ తరుపున రూ. 10వేలు అందిస్తున్నట్లు తెలిపారు. ఘటన జరిగిందని తెలిసిన వెంటనే అప్రమత్తమయ్యామన్నారు. తమ ప్రభుత్వం కష్టసమయాల్లో ప్రజలకు అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఇక ప్రతి రోజూ వంద కుక్కలకు స్టెరిలైజేషన్ చేయాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుంటామన్నారు.
కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడుతూ కుక్క దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87484