ఆంధ్రప్రదేశ్
కుల వివక్ష నిర్మూలనకు ప్రభుత్వాలు కృషి చేయాలి…. కర్నూలు జిల్లా కార్యదర్శి ఆనంద్ బాబు
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్:

కుల వివక్ష నిర్మూలనకు ప్రభుత్వాలు కృషి చేయాలని, నాగరికత పెరుగుతున్న రోజురోజుకు సమాజంలో కుల వివక్షత మాత్రం తగ్గడం లేదని కర్నూలు జిల్లా కార్యదర్శి ఎం డి ఆనంద్ బాబు అన్నారు. కుల వివక్ష పోరాట సమితి ఏర్పడి నేటికీ 26 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రాలయం మండలం పరిధిలోని మాధవరం గ్రామంలో నూతన కుల వివక్ష పోరాట సమితి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు జిల్లా కార్యదర్శి ఎం డి ఆనంద్ బాబు మాట్లాడుతూ….. రోజురోజుకు సమాజంలో కులవివక్షత పెరుగుతుంది అనడానికి ఇటీవల కాలంలో పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో జరిగిన ఉదాంతం ఓ ఉదాహరణ. ఇలాంటి దురాగతాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో ప్రభుత్వాలు కుల వివక్షతపై ప్రజలకు అవగాహన కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జయరాజు,మండల కార్యదర్శి అంజి, అధ్యక్షుడు ,వీరన్న,మాధవరం గ్రామ నాయకులు సురేష్,మారెప్ప,ఇజ్రాయిల్,దేవ,దొడ్డి ,ఎలీషా,హనుమంతు,తిక్కన్న,మకల ఆంజనేయ,అశోక్,బుల్లి అబ్బాయ్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87480